Rtc staff call off proposed strike

RTC staff call off proposed strike, APSRTC Employees Unions, APSRTC Employees, strike notices from July 5, Telangana Mazdoor Union, union called off the strike

RTC staff call off proposed strike

హమ్మయ్యా... రైట్ రైట్..

Posted: 07/05/2013 10:37 AM IST
Rtc staff call off proposed strike

హమ్మయ్యా.. అంటూ ఊపీరి పీల్చుకున్నారు రాష్ట్ర ప్రజలు. ఏ అర్థరాత్రి మనకు స్వాతంత్యం వచ్చిందో.. అప్పటి నుంచి మనకు అర్థరాత్రి చర్చలు సఫలం అవుతున్నాయి.కొన్నిరోజులనుండి ఆర్టీసీకార్మికులుఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరుపుతూ..సమ్మెసైరన్ కు పిలుపునిచ్చారు. అయితే చివరకు అర్థరాత్రి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు యాజమాన్యం తలవొంచకతప్పలేదు. ఈరోజు నుండి తలపెట్టిన సమ్మెను కార్మిక సంఘాలు విరమించుకున్నాయి. గురువారం అర్థరాత్రి వరకు పలు దఫాలుగా చర్చలు జరిపారు. చివరకు ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య అంగీకారం కుదిరింది. లిఖిత పూర్వక హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు ప్రకటించారు.

ఆర్టీసీలో 17287 మంది కాంట్రాక్టు కండక్టర్లు, డ్రైవర్లను నాలుగు దశల్లో క్రమబద్దీకరిస్తామని యాజమాన్యం హామీనిచ్చింది. సెప్టెంబర్ నెల తొలిదశలో 8643, రెండో దశలో 875, మూడో దశలో 3447, నాలుగో దశలో 4322 మందిని క్రమబద్దీకరిస్తారు. ఈ మొత్తం పక్రియ 2014 సంవత్సరంలోపు పూర్తవుతుంది. వేతన సవరణ అంశంపై ఈనెల 12వ తేదీన సంఘం సమావేశం కానుంది. కాంట్రాక్టు కార్మికుల్లో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలను వర్తింప చేస్తారు. గతనెల 27వ తేదీన సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో కార్మిక సంఘ నేతలతో ఆర్టీసీ యాజమాన్యంతో పాటు రవాణా మంత్రి బొత్స, కార్మిక శాఖ అధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. చివరకు సమ్మెను విరమింపచేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చలు చివరకు కొలిక్కి వచ్చాయి. మొత్తానికి ఆర్టీసీలో సమ్మె పోరు తప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకొన్నారు. ఈ రోజు ఉదయం చర్చలు సఫలం అనే స్వీట్ కబురు తెలుచుకున్నా ఆర్టీసీకార్మికులు.. రైట్ .రైట్ అంటూ.. బస్సెక్కారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles