Apsrtc indefinite strike from july 5th 2013

apsrtc indefinite strike, apsrtc indefinite strike from july 5th 2013, apsrtc unions, july 5th strike, breaking news, ap politics, political news, andhra news

APSRTC indefinite strike from july 5th 2013

ఆర్టీసీలో సమ్మె సైరన్...

Posted: 06/26/2013 04:12 PM IST
Apsrtc indefinite strike from july 5th 2013

ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఆర్టీసీ కార్మికులు జూలై 5 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. యాజమాన్యంతో కార్మిక శాఖ కార్యాలయంలో జరిగిన తుది చర్చలు విఫలమవడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎంప్లాయిస్ యూనియన్(ఈయు), తెలంగాణ మజ్దూర్ యూనియన్(టిఎంయు) లు ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి. ఒప్పంద కార్మికుల క్రమబద్ధీకరణ, వేతన సవరణ వంటి అంశాలపై యాజమాన్యం ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తాము నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. కాగా గతంలో కార్మిక సంఘాలు రెండు దఫాలుగా యాజమాన్యంతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చర్చలు విఫయమైన అనంతరం ఈయు నేత పద్మాకర్ మాట్లాడుతూ నష్టాలు తగ్గించాలనే పేర యాజమాన్యం శ్రమ దోపిడీ చేస్తోందని విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. టిఎంయు నేత అశ్వాద్ధామరెడ్డి మాట్లాడుతూ చర్చల పేరుతో యాజమాన్యం కాలయాపన చేసిందని విమర్శించారు. సమ్మె తేదీ లోపు యాజమాన్యం ఎన్ని సార్లు పిలిచినా తాము చర్చలకు వెళతామని చెప్పారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles