Telangana leader ktr involved in settlements

Telangana leader KTR involved in settlements,KCR,KTR,Telangana,100,Seemandhra,Raghunandan,builder

settlements done by Telangana Rashtra Samithi legislator K T Rama Rao, son of party ... KCR and his family members have already been facing allegations of.

కేసీఆర్ కొడుకు భూ దందాలు చేస్తున్నాడట ?

Posted: 06/20/2013 09:50 AM IST
Telangana leader ktr involved in settlements

తెలంగాణ ఉద్యమ పార్టీగా పేరొందిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ భూదందా చేస్తున్నాడని,  ఓ సెటిల్ మెంట్ వ్యవహానికి సంబంధించి కేటీఆర్ 5 కోట్లకు సెటిల్ మెంటు చేశాడని ప్రముఖ తెలుగు పత్రిక అయిన ఆంధ్రజ్యోతిలో కేటీఆర్ ను ఉద్దేశిస్తూ.... ‘త్యాగాల పేరుతో భోగాల దందా ’ వార్తను ప్రచురించారు. గత రెండు మూడు రోజుల నుండి ఆంధ్రజ్యోతి పత్రిక కు, కేటీఆర్ కి మధ్య ఈ సిటిల్ మెంట్ వ్యవహారం పై ఘర్షణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పత్రిక పచురణలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ఈ వార్తలను ఆధారంగా చేసుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగు దేశం నాయకులు టీఆర్ఎస్ పై మండి పడ్డారు. టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, మొత్తం ఆయన కుటుంబమే ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని దందాలతో నడిపేస్తున్నదని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఎవరు ఎవరు ఎపార్ట్‌మెంట్ కట్టినా, ఎవరు ఏ వ్యాపారం చేద్దామనుకున్నా ముందుగా కేసీఆర్ కుటుంబానికి కప్పం కట్టాలని ఆయన ఆరోపించారు. ఈ కథనం పై స్పందించిన కేటీఆర్ మండి పడి పరువు నష్టం దావా వేస్తామని, ఆంధ్రజ్యోతి పత్రిక ఎల్లో జర్నలిజం చేస్తుందని హెచ్చరించారు. దీని పై స్పందించిన ఆ పత్రిక ఎలాంటి దానికైనా మేం సిద్ధం అని ప్రకటించమే కాకుండా, తగిన ఆధారాలు ఉన్నాయని, ఆన్ని చూసిన తరువాతనే ప్రచారం చేశామని అనడం విశేషం. ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh