అనేక సార్లు కాంగ్రెస్ అధిష్టానం పై అలిగి రాజీనామా చేసే వరకు వెళ్లిన ఎంపీ కల నెరవేరింది. ప్రధాని మంత్రి బుజ్జగింపులతో చల్లబడిన ఎంపీకి మంత్రి పదవి రాబోతుంది. అయిదుసార్లు ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కావూరి సాంబశివరావు చిరకాల కల నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయన కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయనకు జౌళి శాఖ అప్పగిస్తారని తెలుస్తోంది. జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ పునర్వ్యవస్థీకరణలో కావూరిని కాంగ్రెస్ పార్టీ కీలక విభాగమైన వర్కింగ్ కమిటీలో శాశ్వత ఆహ్వానితుడిగా నియమించారు. 1984లో కావూరి సాంబశివరావు తొలిసారి ఏలూరు నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జేడీ శీలంకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. సహాయ మంత్రిగా ఆయనకు అవకాశం దక్కనుంది. కావూరి సాంబశివరావు, ఆస్కార్, శీశ్ రామ్ ఓలా, గిరిజా వ్యాస్ లను కేబినెట్ హోదా మంత్రి పదవులకు, జెడి శీలం, ఇఎంఎస్ నాచిప్ప, మానిక్ రావ్ గవిట్, సంతోష్ చౌదరిలను సహాయ మంత్రులుగా ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో కేంద్రమంత్రి వర్గం సభ్యుల సంఖ్య 77కు చేరనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more