Political minister geetha reddy comments on chandra babu naidu

chandrababu naidu, tdp chief chandrababu naidu, tdp, minister geetha reddy, congress party, errabelli dayakara rao, tdp mla, tdp vs minister geetha reddy, breaking news, ap politics, political news, andhra news

minister geetha reddy comments on chandra babu naidu

బురదలో ఉన్న చంద్రబాబును గుర్తించిన మంత్రి

Posted: 06/17/2013 05:00 PM IST
Political minister geetha reddy comments on chandra babu naidu

కళంకిత అన్న పేరు వినగానే ఆ మంత్రి మండిపడుతుంది. ఎవరైన కళంకిత అంటే చాలు పాముల బుసకొడుతుంది. ఆమె ఎవరో కాదు మంత్రి గీతారెడ్డి. ఈరోజు శాసనసభలో మంత్రి గీతారెడ్డి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై ఎన్నోకుంభకోణ ఆరోపణలున్నాయన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులతో మాట్లాడించినందుకు టిడిపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులతో సభలో మాట్లాడిస్తే వాకౌట్ చేస్తామని టిడిపి ముందే స్పష్టం చేసింది. టిడిపి సభ్యులు తమ ఇష్టమొచ్చినట్లు కళంకిత మంత్రులంటూ మాట్లాడుతున్నారని గీతారెడ్డి మండిపడ్డారు. కళంకిత మంత్రులంటూ టిడిపి సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు వాడిన మాటను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. టిడిపి సభ్యులను సస్పెండ్ చేయండని ఆమె శాసనసభాపతికి సూచన చెప్పారు. ఆరోపణలున్నంతమాత్రాన కళంకిత మంత్రులని ఎలా అంటారు? అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు తనపై ఉన్న కేసుల్లో స్టే తెచ్చుకున్నారని గుర్తు చేశారు. బురదలో వున్న చంద్రబాబు ఇతరులపై బురద వేయడం తగదన్నారు. చంద్రబాబు వైఖరికి నిరసనగా ఎంతో మంది నేతలు టిడిపిని వీడారన్నారు. నాగం జనార్ధన రెడ్డి, దాడి వీరభద్రరావు, నాని లాంటి ఎంతోమంది పేరున్న నేతలు టిడిపికి గుడ్ బై చెప్పారని గీతారెడ్డి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles