Dot slaps rs 100 crore fine on vodafone india

vodafone, 100-crore fine on vodafone india , subscriber local dialling, bharti airtel, airtel, dot, andhra politics, politics,chalo assembly telangana,live updates,2013,chalo assembly,telangana chalo assembly,chalo assembly, breaking news, ap politics, political news, andhra news

DoT slaps Rs 100-crore fine on Vodafone India

ఒక్క వొడా ఫోనుకు 100 కోట్ల ..?

Posted: 06/14/2013 06:10 PM IST
Dot slaps rs 100 crore fine on vodafone india

ఉచిత ఆపర్లు మీద ఆపర్లు ఇచ్చిన వోడాపోన్ ఇప్పుడు వేల కోట్లు రూపాయలు భాకీపడింది. ఒకటి కాదు రెండు ఏకంగా 12 వేల కోట్ల రూపాయలు బాకీ పడింది. వొడాఫోన్‌కు కేంద్ర టెలికాం శాఖ 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. 2003 నుంచి 2005 మధ్య ఎస్టీడీ సర్వీసులను లోకల్‌ సర్వీసులుగా మార్చినందుకు ఈ జరిమానా వేసింది. ఇదే తరహా ఆరోపణల మీద మే నెల 30న భారతీ ఎయిర్‌టెల్‌పైన కూడా టెలికాం శాఖ జరిమానా విధించిన విషయం తెలిసిందే. అటు వొడాఫోన్‌, ఇటు భారతీ ఎయిర్‌టెల్‌.. రెండూ కూడా వేర్వేరు కారణాల వల్ల తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. వొడాఫోన్‌ దాదాపు 12 వేల కోట్ల రూపాయల ట్యాక్స్‌ చెల్లించాలని ఐటీ శాఖ గట్టిగా పట్టుపడుతోంది. దీని మీద కోర్టు బయట సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ సమయంలో వంద కోట్ల జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఎయిర్‌టెల్‌ కూడా దక్షిణాఫ్రికా మార్కెట్లో నష్టాల నుంచి బయటపడటానికి కిందా మీదా పడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles