Political lk advani resigns from all posts in bjp

lk advani, lk advani resigns from all posts in bj, gujarat chief minister narendra modi, bjps campaign committee, election committee, bjp president rajnath singh

LK Advani resigns from all posts in BJP

అద్వానీ రాజీనామా? మోడీ పై నిరసనగా ?

Posted: 06/10/2013 02:51 PM IST
Political lk advani resigns from all posts in bjp

భారతీయ జనతా పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. పార్టీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ బీజేపీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. జాతీయ కార్యవర్గం, పార్లమెంటరీ పార్టీ బోర్డు, ప్రచార కమిటీ బాధ్యతలకు రాజీనామా చేస్తూ ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. నరేంద్ర మోడీని పార్టీ ప్రచార కమిటీ సారధిగా నియమించటంపై అసంతృప్తితో ఉన్న అద్వానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది కాలంగా భారతీయ జనతా పార్టీ పనితీరును తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఎల్ కే అధ్వానీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆయన దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో పార్టీలో చాలా మంది వ్యక్తి గత అజెండాతో పనిచేస్తున్నారని, సిద్దాంతాలకు అనుగుణంగా పార్టీ ఎక్కువ కాలం పనిచేస్తుందని అనుకోవట్లేదని , సిద్దాతాలకు కట్టుబడని పార్టీలో తాను కొనసాగలేనని అద్వాని అన్నారు. అయితే అద్వానీ రాజీనామాపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles