Jagan and sabita attended the nampally court

Jagan and Sabita Attended the Nampally court hearing, YS Jagan Assets case, Dalmia Cements case, Media, Bullet Proof Vehicle, Security, Kartik, Hearing Adjurn for sometime, Jagan Requested permission from court to speak with his family members, jagan fans, ysrc party leaders

Former Home Minister Sabitha Indra Reddy and YSR Congress Party chief YS Jaganmohan Reddy in DA case will appear before the CBI special court in Nampally

కోర్డు దగ్గర గందరగోళం

Posted: 06/07/2013 12:35 PM IST
Jagan and sabita attended the nampally court

అక్రమాస్తుల కేసులో భాగంగా దాల్మియా కేసు విచారణ నిమిత్తం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు నాంపల్లి కోర్టుకు వచ్చారు. ఈ ఉదయం ఆయనను పోలీసులు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలో భారీ బందోబస్తు మధ్య నాంపల్లి కోర్టుకు తరలించారు. అయితే చాలా రోజుల తరువాత జగన్ కోర్టుకు రావడంతో ఆయన అభిమానులు భారీ సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకోవడంతో అక్కడ కాస్తంత గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీంతో పోలీసులు వారిని అదుపు చేయడానికి నానా అవస్థలు పడ్డారు. కోర్టు ముందు జగన్ మద్దతుదారులు ఆయనకు  అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టుకు జగన్ తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, భార్య భారతి వచ్చారు. ఇక జగన్, సబితా కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఆయన మద్దతుదారులు లోనికి రావడంతో కేసును 10 నిమిషాలు వాయిదా వేశారు. దీంతో జగన్ బ్యాచ్ కోర్టు హాల్‌లో వేచి వుంది.  కుమారుడు కార్తీక్‌రెడ్డితో కలిసి సబిత కోర్టు వచ్చారు. మరోవైపు ఈ కేసులో నిందితురాలుగా ఉన్న శ్రీలక్ష్మి ఆంబులెన్స్‌లో కోర్టుకు చేరుకున్నారు. కేసు విచారణ తరువాత తమ కుంటుంబ సభ్యులతో మాట్లాడేందుకు 1 గంట అనుమతి ఇచ్చారు. కోర్టులోకి వచ్చిన జగన్ సబితా ఇంద్రారెడ్డిని చిరునవ్వుతో పలకరించడమే కాకుండా అక్కడున్న వారిని కూడా జగన్ నవ్వూతూ పలకరించారు. ఇక ఈ కేసులో ఈనెల 21 వరకు రిమాండు విధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles