Ys jaganmohan reddy illegal case

ys jaganmohan reddy, ysr congress party, illegal assets case, ed attachment, chenchelguda jail, vijayasai reddy

ys jaganmohan reddy, ysr congress party, illegal assets case, ed attachment, chenchelguda jail, vijayasai reddy

జగన్ నేడు బయటకు

Posted: 06/07/2013 10:30 AM IST
Ys jaganmohan reddy illegal case

అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి, గత సంవత్సర కాలంగా చంచల్ గూడ జైలులో ఊచలు లెక్కబెడుతూ ప్రశాంతమైన జీవితాన్ని నాలుగు గోడల మధ్య గడుపుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చాలా రోజుల తరువాత నేడు బయటకు రాబోతున్నాడు. అంటే బెయిల్ పై కాదు... కొన్ని గంటలు బాహ్య ప్రపంచంలోకి వచ్చి స్వేచ్చా వాయువులు పీల్చుకోవడానికి. దాల్మియా వ్యవహారం పై సీబీఐ ధాఖలు చేసిన ఛార్జిషీటు ను పరిగణలోకి తీసుకొని నిందుతులకు సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా నిందుతులు కోర్టుకు హాజరుకావాల్సింది కోర్టు ఆదేశించడంతో నేడు జగన్ నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. అయితే గతంలో ఈయనను కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. కానీ రోజు ఆయన బయటకు వస్తుండంతో ఆయనను చూడటానికి భారీగా అభిమానులు తరలి వస్తున్నారు. కోర్టుకు హాజరు అయిన తరువాత జగన్ ను కుటుంబ సభ్యులు కలిసే అవకాశం ఉండవచ్చు. ఇక ఈయనతో పాటు సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారులు, శ్రీలక్ష్మి, రాజగోపాల్, విజయసాయి రెడ్డి లు కూడా హాజరు కానుండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles