Political trs mla harish rao comment on chandrababu naidu

mla harish rao, trs mla harish rao, tdp, tdp mahanadu, tdp leaders, chandrababu naidu, telangana issue, trs party, harish rao vs chandrababu,

trs mla harish rao comment on chandrababu naidu

బాబుతో హరీష్‌రావు గుద్దులాట..?

Posted: 05/28/2013 06:40 PM IST
Political trs mla harish rao comment on chandrababu naidu

రెండో రోజు జరుగుతున్న మహానాడులో చంద్రబాబు తెలంగాణ పై ఒక నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ టీడీపీ నాయకులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు పై తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబును ఎన్నటికీ విశ్వసించరు అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. 2009లో తెలంగాణపై మాట తప్పిన బాబును ఇక్కడి ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరని తేల్చిచెప్పారు.

రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతునాన్న బాబు తెలంగాణ సాధించు కొస్తనని ఎందుకు చెప్పడు అని ప్రశ్నించారు. ఒక వైపు తెలంగాణ నేతలతో జై తెలంగాణ అనిపిస్తూ, మరోవైపు సీమాంధ్ర నేతలతో సమైక్యాంధ్ర అనిపిస్తున్నారని చెప్పారు. మహానాడులో తెలంగాణపై తీర్మానం ముసుగులో గుద్దులాటలా ఉన్నది అని విమర్శించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలంగాణ తీర్మానం చేయించడం కాదు.. ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకున్న పయ్యావుల కేశవ్, దేవినేని ఉమతో తెలంగాణపై తీర్మానం చేయించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles