Political congress minister celebrates ntr jayanthi

minister dokka manikya varaprasad rao, congress party, tdp, senior ntr jayanthi, ntr birthday, nandamuri taraka ramarao, telugudesam party, minister office, harikrishna, ysrcp, ys jagan, tdp mahanadu, junior ntr, lokesh babu

congress minister celebrates NTR Jayanthi

ఎన్టీఆర్ జయంతి జరుపుకున్న కాంగ్రెస్ మంత్రి ?

Posted: 05/28/2013 01:03 PM IST
Political congress minister celebrates ntr jayanthi

కాంగ్రెస్ పార్టీ మంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను జరుపుకున్నారు. మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలలు జరిగాయి. గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి డొక్కా పాల్గొన్నారు. తాను వ్యక్తిగతంగా ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పారు. ఎన్టీఆర్ ప్రజల మనిషి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రం డబ్బున్న వాళ్ల మనిషన్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు.

ఇటీవల కాలంలో ఎన్టీఆర్ గారు అందరివాడు అని పేరు తెచ్చుకున్నారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు ఎన్టీఆర్ ఫోటోను పెట్టుకోవటానికి ఇష్టపడుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ చెప్పినట్లుగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఫ్లెక్సీలలో ఏర్పాటు చేసుకున్నట్లుగా నందమూరి తారక రామారావు ఇప్పుడు అందరి వాడు అవుతున్నారు. జగన్ పార్టీ ఫ్లెక్సీలలో ఎన్టీఆర్ ఫోటో కనిపించడం, దానిపై హరికృష్ణ స్పందిస్తూ ఆయన అందరి వాడని చెప్పడం కొద్ది రోజుల క్రితం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్‌ను కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు ఇప్పుడు సొంతం చేసుకుంటున్నాయి.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles