Political complaint in hrc against mla katasani ram bhupal reddy

MLA Katasani Ram Bhupal Reddy, congress mla katasani ram bhupal reddy, rajeswari, hrc, kurnool, rajeswari house, congress party office,

Complaint in HRC against MLA Katasani Ram Bhupal Reddy

చంపేస్తామని బెదిరిస్తున్నారు: రాజేశ్వరి

Posted: 05/27/2013 05:55 PM IST
Political complaint in hrc against mla katasani ram bhupal reddy

ర్నూలు జిల్లా పాణ్యం ఎమ్యెల్యే అనుచరులు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని మహిళా సంఘం నేత రాజేశ్వరి అన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తనను వేధిస్తున్నాడని ఆమె ఎపి మానవ హక్కుల సంఘం(హెచ్చార్సీ) కి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే అనుచరులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాటసాని తన ఇంటిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చివేసి తన అనుచరులతో తనపై దాడికి యత్నించారని చెప్పారు.

ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసుకోలేదని వాపోయారు. తాను తన చెల్లి ఇంట్లో తలదాచుకుంటుంటే అక్కడికీ వచ్చి తనపై వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇప్పుడు తన ఇంటిని ప్రొక్లెయిన్లతో కూలదోసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే, అతని అనుచరులు నుంచి తనకు ప్రాణహాని ఉందని హెచ్చార్సీ లో ఫిర్యాదు చేశానని చెప్పారు. గత ఏడు ఎనిమిది నెలలుగా శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles