Political osmania university students attack on minister chiranjeevi house

minister chiranjeevi, osmania university students, osmania university students attack, ap tourism meeting, telangana student, congress party, political leaders, jubillyhill polices station, chiranjeevi new scam,

osmania university students attack on minister chiranjeevi house

అర్థరాత్రి చిరంజీవి ఇంటి పై ‘టీ ’ సునామీ ?

Posted: 05/24/2013 01:40 PM IST
Political osmania university students attack on minister chiranjeevi house

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. మొన్న చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నడిరోడ్డు జరిగిన విషయానికి పెద్ద గోల గోల చేశారు కొంతమంది రాజకీయ నాయకులు. నిత్యం రాజకీయల్లో ఎదుగుతున్న మంత్రి చిరంజీవిపై రాజకీయ కుట్ర జరుగుతునే ఉంది. పర్యాటక శాఖ సదస్సు పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు రాత్రి మంత్రి చిరంజీవి ఇంటిని ముట్టడించారు.

చిరంజీవి దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా, వీరిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పర్యాటక సదస్సు పేరుతో భారీ కుంభకోణం జరిగిందని వారు ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఓయు జెఏసి అధికార ప్రతినిధి కృశాంక్ మాట్లాడుతూ... ఏప్రిల్ 12, 1314 తేదీలలో బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం కాన్ఫరెన్స్ నిర్వహించారని,

ఇందుకోసం రూ.2.14 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఈ సదస్సు పేరుతో భారీ అవినీతి జరిగిందని, ఇందుకు బాధ్యత వహించి చిరంజీవి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం చిరంజీవి పై అవినీతి మరకలు వేయ్యాటానికే రాజకీయ కుట్ర జరుగుతుందని మెగా అభిమానులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles