No decission om telangana antony

ak antony, telangana, rahul gandhi

he union minister AK Antony said final decission on Telanagna has not been taken. Rahul Gandhi said that he is not in PM race

పాత మాటే చెప్పిన ఆంటోని

Posted: 05/23/2013 09:27 AM IST
No decission om telangana antony

నిన్న రాత్రి న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో యూపీఏ-2 వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు ముఖ్యనేతలు, మంత్రులు, విపక్షాల నేతలు పాల్లొన్నారు. ఈ సందర్భంగా యూపీఏ-2 పాలన పై, 2012-13 ప్రగతి నివేధికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. యూపీఏ పాలనలో దేశం ఎంతో ముందుకు వెళ్లిందని అన్నారు. సోనియా గాంధీ మన్మోహన్ పాలలను మెచ్చుకున్నారు.  ఇక ఈ సమావేశానికి హాజరైన రక్షణ మంత్రి ఆంటోని మీడియాతో మాట్లాడుతూ...  యూపీఏ ప్రభుత్వం ఇంత వరకు తెలంగాణ అంశం పై ఏ నిర్ణయం తీసుకోలేదేని అన్నారు. కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ప్రధాన మంత్రి పదవి రేసులో తాను లేనని, ఈ విషయం తాను ఎన్నో సార్లు చెప్పానని ఆయన అన్నారు. మన్మోహన్ సింగ్ సమర్థుడని, చక్కగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. నాయకత్వాన్ని మార్చే ప్రసక్తి లేదని, ప్రధానికీ సోనియాకూ మధ్య విభేదాలు లేవని రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఈ వార్షికోత్సవాలకు ముఖ్యమంత్రి కిరణ్ రాలేదు. ఇక గమనించదగిన విషయం ఏంటంటే... ఈ వేడుకలకు త్వరలో తెరాసలో చేరుతారన్న వార్తలు వస్తున్న టి.కాంగ్రెస్ ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, జి. వివేక్ హాజరవడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles