Telangana news mangalasutras not hindu culture kcr

mangalasutras, hindu marriage system, kcr, rs president k chandrashekhar rao, sensational remarks on the hindu marriage, trs ex leader solipeta ramalingreddy son marriage, satyaharichamdrudu, gajani mahmadu, hindu culture

mangalasutras not Hindu culture: KCR

కెసిఆర్ సంచలన వ్యాఖ్య

Posted: 05/22/2013 07:14 PM IST
Telangana news mangalasutras not hindu culture kcr

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మీడియా ముందుకు వస్తే తప్పని సరిగా ఒక సంచలన ప్రకటన ఉంటుంది. సంచనల ప్రకటన లేకపోయిన.. రాజకీయ నాయకుల పై తిట్ల వర్షం కురిపించి మీడియాకు మంచి వార్తల విందు ఏర్పాటు చేస్తారు. కేసిఆర్ చేసిన వ్యాఖ్యలను మీడియాలో హాట్ హాట్ గా ప్రచారం అవుతాయానేది అందరికి తెలిసిందే. అయితే ఈసారి ఏకంగా ఆయన హిందు సంప్రదాయమైన మంగళసూత్రం పై హాట్ కామెంట్ చేశారు.

మంగళసూత్ర ధారణపై కె. చంద్రశేఖర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళసూత్రధారణ హిందూ సంప్రదాయం కాదని ఆయన అన్నారు. ఆ రకంగా ఆయన హిందూ వివాహసంప్రదాయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో తెరాస మాజీ శానససభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి కుమారుడు, కూతుళ్ల స్టేజ్ మ్యారేజీకి ఆయన హాజరయ్యారు. పురాణల్లో ఎక్కడా మంగళసూత్రధారణ లేదని,

గజినీ మహ్మద్ కాలంలో హిందూ మహిళలపై దాడులతో రక్షణ కోసం మంగళసూత్రధారణ పద్దదతి వచ్చిందన్నారు. నిజమైన పెళ్లి అంటే స్టేజ్ మ్యారేజీ అని ఆయన అన్నారు. అసలు మంగళసూత్రధారణ లేదని కేసిఆర్ చెబుతున్నాడు.. కానీ సత్యహర్చింద్రుడు భార్య చంద్రమతి మెడలో మంగళసూత్రధారణ ఎలా జరిగింది? గజనీ మహ్మద్ కంటే ముందు కాలం నాటి వ్యక్తి సత్యహర్చింద్రుడు. ఏమైన కేసిఆర్ సంచలన వ్యాఖ్యలు ఎందుకు చేశారో ఆ పేరుమాళ్లకే తెలియాలి... 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles