Nara lokesh babu comment on minister chiru ys jagan

nara lokesh babu, tdp leader nara lokesh babu, chandrababu naidu son nara lokesh babu, nara lokesh babu comment on minister chiranjeevi, nara lokesh babu on ys jagan, congress party, andhrapradesh,

nara lokesh babu comment on minister chiru- ys jagan

ట్విట్టర్ బాబు బయట విసుర్లు..? పంచరత్నాలు..?

Posted: 05/20/2013 06:29 PM IST
Nara lokesh babu comment on minister chiru ys jagan

మొన్నటి వరకు మీడియా ముందు కామెంట్ చెయకుండా, ట్విట్టర్ ద్వారా తన హాట్ కామెంట్ ను రాజకీయ ప్రత్యర్థులపై గుప్పించే చోట నాయకుడు నారా లోకేష్ బాబు. ఇటీవల రాజకీయాల్లోకి నన్ను లాగకండి అని మీడియా ముందు చెప్పిన నాయకుడు. అలాంటిది ఆ సారి ఏకంగా మీడియా ముందు కామెంట్లు చేస్తున్నాడు. ప్రస్తుతం రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగే నేత కావాలన్నారు. టిడిపికి పత్రిక, ఛానల్ లేవని, అవి ఉంటే మనమూ జైల్లోనే ఉంటామని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

సామాజిక సేవ, సామాజిక న్యాయం అన్న వాళ్లు సొంత సేవ, సొంత న్యాయం చూసుకొని వెళ్లిపోయారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. బాబ్లీపై ఢిల్లీకి అఖిలపక్షం బాబ్లీ ప్రాజెక్టు విషయమై అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో బాబ్లీ ప్రాజెక్టు పైన అఖిల పక్ష సమావేశం జరిగింది. పార్టీల అభిప్రాయాలు తీసుకొని అడ్వోకేట్లను నియమించాలని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్తామని, క్యురేటివ్ లేదా రివ్యూ పిటిషన్ వేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఆ సమర్థత చంద్రబాబుకే ఉందన్నారు.

తెలుగుదేశం పార్టీ మాత్రమే బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 2004 వరకు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో ముందుండేదని, ఇప్పుడు వెనుకబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు అందరికీ ఆదర్శంగా నిలువాలని, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సేవ చేయాలన్నారు. కలెక్షన్ కింగ్‌లను ఆదర్శంగా తీసుకుంటే సమాజానికి అనర్థమేనని విమర్శించారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టవలసిన బాధ్యత టిడిపి కార్యకర్తల పైనే ఉందని ఆయన చెప్పారు. టిడిపి అధికారంలోకి రాగానే పంచరత్నాలు అమలు చేస్తామన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles