Dharmana resignation still pending in cm

politics,state politics,AP Congress, P. Sabitha Indra Reddy, Dharmana Prasada Rao, Kiran Kumar Reddy, AP Ministers

Dharmana resignation still pending in CM court.

రాజీనామాలను పెండింగ్ లో ఉంచిన కిరణ్

Posted: 05/21/2013 09:21 AM IST
Dharmana resignation still pending in cm

కళంకిత మంత్రులుగా పేరొందిన మంత్రి ధర్మాన ప్రసాధ రావు, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిలు ఆగమేఘాల మీద తన మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రాజీనామాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే ఆమోధించకుండా వాటిని పెండింగులో పెట్టారు. తన రాజీనామా ఆమోదానికి నాలుగు నెలల గడువు కావాలని, కోర్టులో నుండి తీర్పు తనకు అనుకూలంగా రాకపోతే అప్పుడు రాజీనామాలను ఆమోదించాలని మంత్రి ధర్మాన ముఖ్యమంత్రి కిరణ్ కి ప్రతిపాదించారు. అయితే ఇదే ప్రతిపాదనను కిరణ్ కుమార్ పార్టీ అధిష్టాన పెద్దలలో ఒకరైన అహ్మద్ పటేల్ కి నివేదిక పంపించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న రాజకీయ నేపథ్యంలో కూడా వీరి రాజీనామాలను ఇంకా పెండింగులో పెడతారా అన్నది ఇక్కడ గమనించదగిన విషయం. అయితే కళంకిత మంత్రుల విషయంలో అధిష్టానం కఠిన నిర్ణయంతో ఉండటంతో వీరి రాజీనామాలను మరో రెండు రోజుల్లో ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. అయితే ధర్మాన తన పుట్టిన ఉన్న సందర్భంగానే ముఖ్యమంత్రిని గడువు కోరాడని, దానికి కిరణ్ అంగీకరించినట్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles