Summons to andhrajyothy md radha krishna

vemuri radha krishna, vemuri radhakrishna md of andhra jyothi, nampalli court issued summons to radhakrishna, andhra jyothi md radhakrishna

Summons to AndhraJyothy MD Radha Krishna

రాధాక్రిష్ణ మెడకు కాల్ డేటా కేసు!

Posted: 05/18/2013 05:44 PM IST
Summons to andhrajyothy md radha krishna

కాల్ డేటా కేసు గొడవ ఇంకా నడుస్తూనే ఉంది. కాకపోతే ఈసారి ఈ తగాదా ఆంధ్రజ్యోతి ఎమ్.డి.రాధాకృష్ణకు,రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు వియ్యంకుడు రఘురామకృష్ణంరాజుకు మధ్య జరుగుతోంది. తనకు సంబందించి తప్పుడు వార్తలను జ్యోతి పత్రిక ప్రచురించిందని రాజు కోర్టులో ఫిర్యాదు చేశారు.దీనిపై నాంపల్లి క్రిమినల్ కోర్టు సమన్లు జారీ చేసింది.

ఈ కేసు విచారణ ఆగస్టు పదమూడుకు వాయిదా పడింది.ఇలాంటి కేసులు ఇప్పట్లో తేలవు.కాకపోతే సంబందిత పార్టీలు కోర్టుకు హాజరు కావలసి ఉంటుంది. ఈలోగా ఆరోపణలకు గురైన వారు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడమో,

వ్యక్తిగత హాజరు మినహాయింపు తెచ్చుకోవడమో చేస్తారు.ఆ తర్వాత రాజీపడుతుంటారు.ఎక్కువ కేసులలో ఇదే జరిగింది.మరి ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.అయితే ఈ కేసు ఒకరి మెడ నుంచి ఇంకొకరి మెడకు చుట్టుకుంటూ సాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles