Telugu movie news jeevitha rajasekhar comment on ram charan and chiranjeevi

2. jeevitha rajasekhar, eevitha-rajasekhar on chiranjeevi, ram charan, ram charan on jeevitha-rajasekhar, congress party, cm kiran kumar reddy, jeevitha, rajasekhar

jeevitha rajasekhar comment on ram charan and chiranjeevi

రామ్‌ చరణ్‌ సారీ చెప్పాలి..?

Posted: 05/17/2013 12:57 PM IST
Telugu movie news jeevitha rajasekhar comment on ram charan and chiranjeevi

ఆంద్రప్రదేశ్ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల గడప తొక్కి చివరకు కాంగ్రెస్ లో చేరిన జీవిత రాజశేఖర దంపతులు మళ్లీ మీడియా ముందు కనిపిస్తున్నారు. ఇటీవల సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు. సీఎం కిరణాలు, పథకాలు చాలా బాగున్నాయని మీడియా ముందు ఈ ప్రేమ పక్షులు పాటలు పాడాయి.

అయితే ఈసారి మళ్లీ పాత, చేదు, విమర్శలను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. రెండు వారాల క్రితం జరిగిన సంఘటన పై ఈ ప్రేమ జంట మీడియా ముందు హడవుడి చేస్తున్నారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి, ఎవ్వరికి పనికిరాని, సమస్య గురించి మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక సంఘటనకు ఆధారంగా వారు రెచ్చిపోయారు.

యువ హీరో రామ్‌చరణ్‌ తేజ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా వారు పట్టుబట్టారు. రామ్‌చరణ్‌ తేజ భద్రతా సిబ్బంది పట్టపగలు ఇద్దరు వ్యక్తులపై దాడి చేయటం పట్ల తీవ్రమైన అభ్యంతరం తెలిపారు. యువ హీరో బేషరతుగా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. అభిమానులు అనే వాళ్ళు ఉంటేనే ఒక హీరో లేకుంటే సినీ పరిశ్రమ మనుగడ సాగిస్తుంది.

ఆ సంఘటన అవాంఛనీయమైనది. ఎవరికీ మంచిది కాదు అని రాజశేఖర్‌ అభిప్రాయపడ్డారు. రాజశేఖర్‌, జీవితలు, కేంద్ర మంత్రి కె.చిరంజీవిపై విమర్శలు చేశారు. పార్టీలో ఆయన చేరికతో కాంగ్రెస్‌కు ఒరిగిందేమీ లేదని రాజశేఖర్‌ పేర్కొన్నారు. ఒక కులం పేరుతో లబ్ది పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు' అని రాజశేఖర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఒక కార్యకర్తగా మాత్రమే పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles