Telangana news raghunandan for legal battle against trs

raghunandan, trs leader raghunandan, suspended leader raghunandan rao, telangana rashtra samithi, trs chief k chandrasekhara rao, harish rao, 80 lakh, padmalaya studios in a deal

raghunandan for legal battle against trs

టిఆర్ ఎస్ కు రఘునందన్ హెచ్చరిక

Posted: 05/17/2013 08:25 PM IST
Telangana news raghunandan for legal battle against trs

టిఆర్ఎస్ పై న్యాయపోరాటం చేస్తానని ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రఘునందన రావు హెచ్చరించారు. తనను బహిష్కరించడానికి ఆ పార్టీ కారణాలు చెప్పలేకపోయింది. వారికి ఇచ్చిన 48 గంటల సమయం ముగిసింది. వారి వద్ద ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టమైంది. తనని ఎందుకు సస్పెండ్ చేశారో స్పష్టంగా చెప్పలేకపోయారు. రెండు మూడు రోజుల్లో టిఆర్ఎస్ కు, టిన్యూస్ కు లీగల్ నోటీసులు పంపుతానని ఆయన చెప్పారు. టిఆర్ఎస్ నేతలు టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు.

పద్మాలయా స్టూడియోపై హరీష్ రావు హైకోర్టులో పిల్ వేశారు. 80 లక్షల రూపాయలు తీసుకొని రాజీపడ్డారని ఆరోపించారు. పద్మాలయ వివాదంపై విజయశాంతి ఇంట్లో రాజీ కుదిరినట్లు తెలిపారు. ఇద్దరు నిర్మాతలు, విజయశాంతి భర్త కలిసి పంచాయతీ చేశారని చెప్పారు. ఆధారాలు అన్నీ తన వద్ద ఉన్నాయని తెలిపారు. వారు చేసిన పొరపాటును సరిదిద్దుకుంటారని చూశానని, ఇక న్యాయపోరాటమేనని చెప్పారు. హరీష్ రావు అక్రమాలపై సిబిఐకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles