Political news bjp unhappy and upset over defeat in karnataka elections

bjp unhappy, bjp upset, karnataka elections, congress party happy, sonia gandi, bjp leaders, 2014 election,

bjp unhappy and upset over defeat in karnataka elections

అంతర్మథనంలో బీజేపీ

Posted: 05/08/2013 05:25 PM IST
Political news bjp unhappy and upset over defeat in karnataka elections

కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పరాజయం చెందడంపై బిజెపి అంతర్మథనం చెందుతోంది. తదుపరి కార్యాచరణకు సంబంధించి పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ సందర్భంగా పార్టీ పరాజయం చెందడానికి గల కారణాల గురించి నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశమై నేతలు దృష్టిసారిస్తారని తెలుస్తోంది. మరోవైపు కన్నడ నాట వెలువడుతున్న అసెంబ్లీ ఫలితాల్లో బిజెపి మూడోస్థానానికి పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది.

ఏదేమైనా గత ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయల్లో దూసుకొచ్చిన బిజెపి ఇప్పుడు చతికిలపడింది. గడిచిన ఐదేళ్లలో మూడుసార్లు ముఖ్యమంత్రులను మార్చడం, యడ్యూరప్ప అవినీతి మకిలీ పార్టీని కుదిపేయడం వగైరా.. వగైరా అంశాలు ఓటరును ప్రభావితం చేశాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణ భారతంలో తొలి బిజెపి సర్కారు ఎటువంటి పురోగతినీ సాధించలేకపోయింది. కన్నడ నాట బిజెపి అగ్ర నేతల ప్రచారం కూడా అక్కరకు రాలేదని పొలిటికల్ పండితులు పెదవివిరుస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కు వ్యతిరేక ఓటింగ్ బాగా కలిసివచ్చింది. జేడీ ఎస్ కూడా అనుకున్న ఫలితాలను సాధించామన్న ధీమాలో ఉంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles