Saraswati pushkarams at kaleswaram karimanagar dist

sarasati pusharams, kaleswaram temple, alahabad, triveni sangamam, godavari, pranahita, saraswati river, ganga, yamuna, saraswati

saraswati pushkarams at kaleswaram, karimanagar dist

సరస్వతి పుష్కరాలు

Posted: 05/04/2013 08:19 AM IST
Saraswati pushkarams at kaleswaram karimanagar dist

అలహాబాద్ లో గంగా యమున సరస్వతి సంగమం జరిగే చోట సరస్వతి నది అంతర్వాహినిలా ఉండటం వలన కనపడదు.  ఆ సరస్వతికి పుష్కరాలు నిర్వహించటానికి పూనుకున్న సందర్భంగా సమాంతరంగా మన రాష్ట్రంలో కూడా సరస్వతి పుష్కరాలను కరీం నగర్ జిల్లా కాళేశ్వరంలో నిర్వహించటానికి నిర్ణయం జరిగింది.  ఆదిలాబాద్ నుంచే వచ్చే ప్రాణహిత కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది.  అదే చోట అంతర్వాహినిలా సరస్వతి నది కలుస్తుందని కాళేశ్వరంలో కూడా సరస్వతి పుష్కరాలు జరుపహబోతున్నారు. 

12 సంవత్సరాలకోసారి వచ్చే పుష్కరాల వేడుకను మే 30 నుంచి జూన్ 10 వరకు 12 రోజుల పాటు జరిగే సమారోహానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు.  వేసవి శలవులు కూడా కావటంతో ఆ రోజుల్లో మన రాష్ట్ర ప్రజలే కాక పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్న ఉద్దేశ్యంతో తదనుగుణంగా ఏర్పాట్లను చెయ్యటానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles