Telugu people received 6 dada saheb phalke awards

6 dada saheb phalkes to telugu artists, b n reddy, l v prasad, jairaj, nagireddy, akkineni nageswararao, rama naidu

telugu people received 6 dada saheb phalke awards

మనకు ఆరుగురు దాదాలు

Posted: 05/03/2013 05:51 PM IST
Telugu people received 6 dada saheb phalke awards

భారతీయ చలనచిత్రాలకు ఆద్యుడైన దుండిరాజ్ గోవింద్ ఫాల్కే జ్ఞాపకార్థం ఆయన శతజయంతి సందర్భంగా 1969లో ప్రవేశపెట్టిన భారతీయ అత్యున్నత చలనచిత్ర పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఇంతవరకు 44 మందికి అందగా అందులో తెలుగువారికి ఆరుగురికి లభించింది.  అయితే ఆ తెలుగువారిలో ఒకరు తెలుగులో కాకుండా హిందీ చిత్రరంగంలో పనిచేసినవారు.

1. 1974లో ఈ పురస్కారం బిఎన్ రెడ్డికి లభించింది.  ఆయన మల్లీశ్వరి, వందేమాతరం, సుమంగళి, దేవత లాంటి ఉత్తమ చిత్రాలకు దర్శకత్వం వహించారు.  
2. 1980 లో కరీంనగర్ వాస్తవ్యుడు, హైద్రాబాద్ లో చదివి, తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న తెలుగు కళాకారుడు జైరాజ్ కి దాదాసాహెబ్ పురస్కారాన్ని గ్రహించారు.  ఆయన హిందీ సినిమా ప్రేక్షకులకు చిరపరిచితులు.  ఆయన 11 మూకీ, 170 టాకీ చిత్రాల్లో నటించారు.  
3. 1982లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత ఎల్.వి.ప్రసాద్.  ఆయన టాకీ సినిమాల తొలిరోజుల్లో సినిమాల్లో నటించారు, సినిమాలను నిర్మించారు, దర్శకత్వం కూడా వహించారు.  
4. 1986 లో విజయ సంస్థను స్థాపించి తెలుగులో ఉత్తమ చిత్రాలను అందించిన నాగిరెడ్డి ఈ పురస్కారం అందుకున్నారు.  
5. 1990 లో ఉత్తమ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకి ఈ పురస్కారం లభించింది.  
6. 2009 లో ఎన్నో భాషల్లో అత్యధిక చిత్రాలను నిర్మించిన డి. రామానాయుడు దాదాసాహెబ్ ఫాల్కేని గ్రహించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles