Another suicide in bengal sarada chits case

sarada chits agent suicide, bengal sarada finance co, sarada chits, sarada chit agents suicides, suicides reach 5 in sarada chits

another suicide in bengal sarada chits case

బెంగాల్ శారదా చిట్స్ ఘటనలో మరో ఆత్మహత్య

Posted: 05/03/2013 09:03 AM IST
Another suicide in bengal sarada chits case

బెంగాల్ లో చిట్ ఫండ్ కుంభకోణంలో ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య 5 కి పెరిగింది.  శారదా గ్రూప్ కూలిపోవటంతో దానిలోని చిట్ ఫండ్ విభాగంలో పనిచేస్తున్న ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే నలుగురు ఆత్మహత్య చేసుకోగా మరో ఏజెంట్ ముర్షిదాబాద్ జిల్లా సాలార్ వాసి 28 సంవత్సరాల ప్రతిమా దాస్ విషం తాగి చనిపోయింది. 

డిపోజిటర్లు ఇచ్చిన సొమ్మును తిరిగి ఇచ్చే పరిస్థితి కనిపించకపోవటంతో ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆమె కుటుంబ సభ్యులు తెలియజేసారు.  బురద్వాన్ జిల్లా కట్వాలోని చిట్ ఫండ్ కంపెనీ శాఖ కార్యాలయానికి వెళ్ళివచ్చిన పద్మ ముఖం చిన్నబోయివుందని, ఆమె వెళ్ళినప్పుడు ఆ కార్యాలయం తాళం వేసి వుండటం ఆమెకు మనస్తాపాన్ని కలిగించిందని కుటుంబసభ్యులు అన్నారు.  డబ్బులు తిరిగి ఇవ్వమని డిపాజిర్లు గత కొన్నిరోజులుగా ఆమెపై వత్తిడి తెస్తున్నారు.  దానితో ఇటు డిపాజిటర్లకు సమాధానం చెప్పలేక, కంపెనీ నుంచి సొమ్ము రాబట్టలేక సతమవుతూ చనిపోయిన నలుగురు ఉద్యోగులతో పాటు పద్మ కూడా ఆత్మహత్యకు పాల్పడింది.

చిన్న చిన్న గ్రామాల నుంచి కూడా వేలాది మంది తమ కష్టార్జితాన్ని శారదా గ్రూప్ లో పెట్టుబడిగా పెట్టి అది ఒక్కసారిగా మునిగిపోవటంతో ఏజెంట్ల మీద వత్తిడి తెస్తున్నారు.  చేసిన పని మీద చిన్నపాటి కమిషన్ కి ఆశపడి చేసిన పనే కానీ సంస్థమీద నియంత్రణ ఉండదు కాబట్టి ఏజెంట్లు ఏమీ పాలుపోని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.  నడిచినంత వరకూ బాగానే ఉంటుంది కానీ ఆగిపోయినప్పుడే ఇలాంటి స్కీమ్ లు అందరినీ ఇబ్బందిపెడతాయి.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles