Political mla shankara rao at indiramma kalalu program in hyderabad

mla shankara rao at indiramma kalalu program in hyderabad, mla shankara rao, ndiramma kalalu program, congress party,

mla shankara rao at Indiramma Kalalu program in hyderabad

ప్రజావసరాలు తీర్చుతాం

Posted: 04/29/2013 07:12 PM IST
Political mla shankara rao at indiramma kalalu program in hyderabad

ప్రభుత్వం వ్యతిరేక పోరాటం చేసిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే శంకరరావు పూర్తిగా మారిపోయాడు. పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత అతనిలో చాలా మార్పు వచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భంలో .. తన ఆరోగ్యం సహకరించకపోయినప్పటికి .. అసెంబ్లీకి వచ్చి.. ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేసి విషయం తెలిసిందే. అప్పటి నుండి శంకరరావు లో దూకుడు తగ్గిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఆయన ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకువెళ్లటానికి శంకరరావు కష్టపడుతున్నారు. ప్రజావసరాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఎస్‌సీ, ఎస్‌టీ ఉప ప్రణాళిక ద్వారా లబ్ధి చేకూరే పథకాలను వినియోగించుకోవాలని కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే శంకరరావు అన్నారు. మారేడుపల్లి డివిజన్ పరిధిలోని అంబేద్కర్‌నగర్ బస్తీలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కలలు కార్యక్రమంలో భాగంగా ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ కె.సరితాయాదవ్ పాల్గొని మాట్లాడారు. ఇంటింటా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలు ఉండాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని వారన్నారు. ఎస్‌సీ, ఎస్‌టి అభ్యున్నతే ధ్యేయమని ఆయన అన్నారు. అంతకు ముందు ఎస్‌సీ, ఎస్‌టి ద్వారా లబ్ది పొందేందుకు దరఖాస్తులు స్థానికులు పెట్టుకున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles