Jpc finds fault with cag report on 2g spectrum

jpc finds faults in cag report, 2g spectrum scam, manmohan singh clean chit, atal bihar vajpayee blamed, nda govt blamed

jpc finds fault with cag report on 2g spectrum

కాగ్ నివేదికలో తప్పులు పట్టిన జెపిసి

Posted: 04/20/2013 01:58 PM IST
Jpc finds fault with cag report on 2g spectrum

నష్టాలనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి- ఒక పని చేసినందువలన, లేదా చెయ్యలేకపోయినందువలన వచ్చే నష్టం. రెండవది- ఒక పని చేసుంటే, లేదా చెయ్యకుండా ఉంటే వచ్చే లాభాన్ని చెయిజార్చుకోవటం వలన అంటే పోగొట్టుకోవటం వలన కాగితం మీద లెక్కకట్టే నష్టం. రెండవది నిజానికి నష్టం లోకి రాదు. ఆశించిన లాభం రాలేదంతే కానీ నష్టం అనిపించుకోదు.

ఈ రెండిటికీ మధ్య ఉన్న చిన్న వ్యత్యాసాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ ఆడిటర్లయిన కాగ్ ను తప్పుపట్టింది. 2జి కుంభకోణంలో 1.76 లక్షల కోట్ల నష్టం వచ్చిందన్న కాగ్ ప్రకటన తప్పని, దీనివలన ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చే విధంగా, అవినీతి దేశాల జాబితాలో చేర్చే విధంగా కాగ్ నివేదికనిచ్చిందని జెపిసి తన డ్రాఫ్ట్ నివేదికలో ఆరోపించింది. ప్రభుత్వం అవలంబించిన లైసెన్సింగ్ విధానం వలన ప్రభుత్వ ఖజానాకి అంతలేసి నష్టం వాటిల్లిందని చెప్పిన కాగ్, సామాన్య ప్రజానీకానికి జరిగిన ప్రయోజనాన్ని మాత్రం లెక్కలోకి తీసుకోలేదని జెపిసి తన నివేదికలో పేర్కొంది.

అసలు నష్టం జరిగింది ఎన్ డి ఏ ప్రభుత్వం సమయంలోనేనని కూడా జెపిసి నివేదిక పేర్కొంది. మైగ్రేషన్ ప్యాకేజ్ ల వలన జరిగిన నష్టాన్ని టెలికాం శాఖ ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోలేదని, దాని వలన టెలికాం లైసెన్స్ ఫీజుని ఒక్కసారే కట్టవలసి రావటంతో భారీ నష్టాన్ని ప్రభత్వం చవిచూసిందని జెపిసి ఆరోపిస్తోంది. ఎన్డీయే హయాంలో జనవరి 2002 లో 6.2 MHz పరిమితిని దాటి 10 MHz వరకు వాళ్ళకి నచ్చిన కంపెనీలకు అదనపు స్పెక్ట్రమ్ ని ఇచ్చారని, అలా అదనపు స్పెక్ట్రమ్ ని కేటాయించటానికి అప్పటి సమాచార శాఖా మంత్రి ప్రమోద్ మహాజన్ కి పంపితే ఆయన ఒక్కరోజులోనే అనుమతినిచ్చేసారని, ఫిబ్రవరి 1 న ఢిల్లీ, ముంబై డివిజన్ లలో కొన్ని కంపెనీలకు వెంటనే స్పెక్ట్ర్రమ్ కేటాయింపులు చకచకా జరిగిపోయాయని, అంతేకాకుండా, కావాలనే స్పెక్ట్రమ్ ని అతి తక్కువ రేటు వేసిందని కూడా జెపిసి ఆరోపించింది.

ఏతా వాతా, ప్రస్తుత ప్రధానమంత్రి కాదు, అప్పటి ఎన్ డి ఏ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పాయ్ దే తప్పంతా అని, 1999లో తీసుకున్న నిర్ణయాల వలన 40000 కోట్ల నష్టం వాటిల్లిందని జాయింట్ పార్లమెంటరీ కమిటీ తేల్చింది.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles