ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ అధిష్టానం హృదయాన్ని దోచుకున్నారని అనకపోయినా, ఢిల్లీ పార్టీ పెద్దలంతా సంతృప్తి పడ్డారనే చెప్పుకోవాలి. అవినీతి మరకలు అంటుకోనివాడు, నిర్భయంగా తన పని తాను చేసుకుంటూ పోయేవాడు, అన్నిటికీ మించి పార్టీకి విధేయుడు, అధిష్టానానికి విశ్వాసపాత్రుడిగా ఆయన మంచి మార్కులు సంపాదించుకున్నారు. ఇక ఎన్నికల ముందు అనవసరమైన ప్రయోగాలు చెయ్యటం కూడా మంచిది కాదు కాబట్టి కూడా కిరణ్ కుమార్ కి మంత్రి వర్గ విస్తరణకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టుగానే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా కిరణ్ కుమార్ పట్ల మంచి అభిప్రాయంలో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వపథకాల్లో వైయస్ ఆర్ ప్రవేశపెట్టినవి కానీ తన హయాంలో ప్రవేశపెడుతున్నవి కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ విధానాత్మక పథకాలేనంటూ కిరణ్ కుమార్ చేస్తున్న ప్రచారం ఆయన స్వార్థరహితమైన విధానాన్ని, పార్టీ పట్ల విశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి.
మే రెండవ వారంలో జరుగనున్న మంత్రి వర్గ విస్తరణలో పార్టీకి విధేయులు మాత్రమే క్యాబినేట్ లో చోటు దక్కించుకుంటారు. ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డ వారి పట్ల అధిష్టానం ఇష్టాన్ని, ఏమీ మాట్లాడకుండా మౌనం వహిస్తూ ఏం జరిగితే అది జరుగుతుందిలే అని ఊరికే ఉన్నవారిపట్ల ఆగ్రహం ప్రకటించినట్లు కూడా సమాచారం.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ అధిష్టానాన్ని కలిసి రాగనే ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఢిల్లీ వెళ్ళి గులామ్ నబీ ఆజాద్ ని కలిసి పార్టీ తాజాగా తీసుకున్న నిర్ణయాలను సమీక్షించారు. ఆజాద్ నుంచి ఏ వివరాలను పొందారో తెలియదు కానీ ఆయనకి మాత్రం తన తరఫునుంచి రాష్ట్రంలోని పరిస్థితులను వివరించి, వచ్చే ఎన్నకలకు ఏ విధంగా తయారీలు చేసుకుంటే బావుంటుందో చెప్పి వచ్చారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more