Hyderabad police nab chennai thief

mohanlal jewelers theft case, chennai theif caught in hyderabad, central crime branch dcp, champalal rajpurohit

hyderabad police nab chennai thief

చెన్నై దొంగను పట్టుకున్న హైద్రాబాద్ పోలీసులు

Posted: 04/18/2013 04:48 PM IST
Hyderabad police nab chennai thief

చెన్నైలో తస్కరించిన 7.76 కిలోల బంగారం, 21 లక్షల రూపాయలు హైద్రాబాద్ పోలీసులు నిన్న పట్టుకున్నారు. హైద్రాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డిసిపి ఎల్ కె వి రంగారావు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేస్తూ, బంగారాన్ని, నగదుని ఆ కేసు దర్యాప్తు చేస్తున్న చెన్నై పోలీసులకు అప్పజెప్పామని చెప్పారు.

26 సంవత్సరాల వయసుగల రాజస్తాన్ కి చెందిన చంపాలాల్ రాజ్ పురోహిత్, చెన్నై మోహన్ లాల్ జువెలర్స్ లో 3 సంవత్సరాలనుంచి పనిచేస్తూ యజమానుల నమ్మకాన్ని చూరగొన్నాడు. అహమ్మదాబాద్ లో తనదంటూ ఒక నగల దుకాణాన్ని నెలకొల్పాలనే చిరకాల వాంఛతో ఉన్న చంపాలాల్ సమయం చూసి, తన ఉద్యోగ ధర్మంగా దుకాణాలలో అమ్ముడుపోని నగలు, అమ్ముడుపోయిన నగలకు నగదుని వసూలు చేసి వస్తుండగా దారిలో దొంగలు లాక్కున్నట్టుగా ఫిర్యాదు చేసాడు కానీ నిజానికి వాటిని తన చిన్ననాటి స్నేహితుడు నాగేందర్ సింగ్, మరో పుక్ రాజ్ ల సాయంతో అక్కడి నుండి దాటించేసాడు. ఏమీ తెలియని అమాయకుడిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసాడు. యజమానులు కూడా చంపాలాల్ మీద నమ్మకాన్ని ప్రకటించటంతో అతను సులభంగా పోలీసు దర్యాప్తు నుండి కూడా తప్పించుకున్నాడు. అయితే, హైద్రాబాద్ లో ఆ నగలను అమ్మే ప్రయత్నంలో పోలీసులకు అందిన సమాచారంతో వలవేసి అతన్ని పట్టుకున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles