Tdp searching where it lost

telugu desam party searching where it lost, electricity charges hike, signatures campaign by tdp, agitation against electricity charges hike

tdp searching where it lost

ఏదైనా పోయిన చోటనే వెతుక్కోవాలి

Posted: 04/18/2013 02:38 PM IST
Tdp searching where it lost

 ఏదైనా పోయిన చోటనే వెతుక్కోవాలన్నట్టు, తెలుగుదేశం పార్టీ పోగొట్టుకున్న అధికారాన్ని అక్కడే వెతుక్కుంటోంది.

విద్యుత్ ఛార్జీల పెంపుకి నిరసనగా అన్ని పార్టీలూ అధికార పక్షం మీద ధ్వజమెత్తాయి కానీ తెలుగు దేశం పార్టీ ఒకడుగు ముందుకేసి సంతకాల సేకరణను చేపట్టగా, మేమంటే మేమంటూ లక్షల మంది సంతకాలు పెట్టి నిరసనను వ్యక్తపరచటానికి తయారయ్యారు.

సంతకాల సేకరణలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి కూడా అప్పట్లో పాల్గొన్నారు. తెదేపా జుబ్లీ హిల్స్ ప్రతినిధి మాగంటి గోపీనాథ్, సంతకాల సేకరణలో లభించిన ఘనమైన ప్రజా స్పందన చూసి ఆనందపడుతూ, ఈ సంతకాల సేకరణకు వచ్చిన ప్రజలను చూస్తే ప్రభుత్వ వైఖరితో ఎంత విసిగిపోయి వున్నారో అర్థమౌతోందన్నారు.

ఏ విద్యుత్ ఛార్జీలైతే తెదేపాను అధికారం నుంచి దూరం చేసాయో, అదే విద్యుత్ ఛార్జీలు మళ్ళీ తెదేపాను అధికారంలోకి తీసుకొస్తాయంటూ గోపీనాధ్ హర్షాన్ని వ్యక్తం చేసారు. ప్రభుత్వ వైఖరి బాగోలేదు, దాన్ని ప్రజా స్పందన ద్వారా క్యాష్ చేసుకుంటామన్న సంగతి జంకు, సంశయం, అపవాదు భయంలాంటివేమీ లేకుండా స్పష్టంగా చెప్పారాయన.

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles