Explosion near bjp office in bangalore

explosion in bangalore, bjp office, malleswaram, 13 injured in bangalore blast, bangalore police

explosion near bjp office in bangalore

బెంగళూరు భాజపా కార్యాలయం సమీపంలో పేలుడు

Posted: 04/17/2013 01:08 PM IST
Explosion near bjp office in bangalore

బెంగళూరులో మల్లేశ్వరం ప్రాంతంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు బాంబు పేలుడు సంభవించింది.  మోటార్ సైకిల్ ని ఉపయోగించి పేల్చినట్టుగా భావిస్తున్న ఈ పేలుడులో 13 మంది గాయపడ్డారు.  అందులో 8 మంది పోలీసులు ఉన్నారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్త.  ఈ ఘటనలో వాహనాలు ధ్వంసమయ్యాయి కానీ భాజపా కార్యాలయంలో నష్టమేమీ జరగలేదు.  నగర కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో జనసమర్దంతో రద్దీగా ఉండే మల్లేశ్వరంలో భాజపా కార్యాలయం ఉంది. 

ఘటనా స్థలి పోలీసుల ఆధీనంలో ఉంది.  బాంబు స్కాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది.  ఈ ఘటనకు సంబంధించి ఏమైనా చెప్పదలచుకుంటే మేమే ప్రకటిస్తామని, ఎటువంటి పుకార్లనూ పట్టించుకోవద్దని, బెంగళూరు నగరంలో శాంతిభద్రతలను కోరుకుంటున్నామని పోలీసులు ప్రకటించారు.  ఉగ్రవాద దిశగా ఇంకా ఆధారాలేమీ లభించలేదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles