Boat carrying minister stopped in the sea

kakinada, hope land, kasu krishna reddy, dist collector, mp harsha kumar, mla ponnala satish kumar

boat carrying minister stopped in the sea

సముద్ర మధ్యంలో మొరాయించిన మంత్రిగారి నావ

Posted: 04/16/2013 02:22 PM IST
Boat carrying minister stopped in the sea

కాకినాడ హోప్ ల్యాండ్ సందర్శనానికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి ఎక్కిన బోటు సముద్రమధ్యంలో ఆగిపోయింది.  కారణమేమిటా అని చూస్తే అది చాలా చిన్నదే.  పెట్రోల్ అయిపోయిందంతే.  విషయం తెలుసుకుని, తీరం నుంచి మరో బోటులో పెట్రోల్ తీసుకుని వెళ్ళారు.  ఆ బోటులో మంత్రి కాసు తో పాటు కలెక్టర్ నీతూ ప్రసాద్, పార్లమెంట్ సభ్యుడు హర్షకుమార్, శాసన సభ్యుడు పొన్నాల సతీష్ కుమార్ ఉన్నారు. 

ఇంధనం వచ్చేంత వరకూ నిర్వీర్యమైన బోటు సముద్రపు అలల మీద ఊగిసలాడుతుంటే, ఇంకా నయం దిగి తొయ్యమన్నారు కాదు అన్నుకున్నారట నాయకులు, అధికారులు. 

ఇంధనం అందటంతో నావ క్షేమంగా కోరంగి రేవుకి చేరుకుంది.

  -శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Swamy yogananda bharati
Call record leaked to undermine me cbi joint director  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles