Swamy yogananda bharati

swamy yogananda bharati, Bhadrachelam, Ramachandra puram, Sri Ramanama kshtram Barathi swami, 30 minits sand , Head,

swamy yogananda bharati

swamy.gif

Posted: 06/28/2012 11:33 AM IST
Swamy yogananda bharati

swamy yogananda bharati

భద్రాచలం తర్వాత నిత్యం రామనామ స్మరణతో ప్రతిధ్వనించే నగరంలోని రామచంద్రపుర అగ్రహారంలో వేంచేసియున్న శ్రీ రామనామక్షేత్రంలో ప్రముఖ యోగ విద్యా నిపుణులు స్వామి యోగానంద భారతి తన వాయుస్తంభన యోగ విద్యతో సంభ్రమాశ్చర్యాలకు లోనుచేశారు. మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ప్రముఖ పట్టణాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో యోగ విద్యా ప్రదర్శించి భారతీయ మహర్షులు అందించిన యోగ విద్య ప్రచారానికి నిరంతరం శ్రమిస్తున్న స్వామి యోగానంద భారతి విజయనగరం జిల్లా నుంచి రామనామక్షేత్రానికి విచ్చేసి అరగంటకు పైగా ఇసుకలో వాయు దిగ్బంధమయ్యారు. శిరస్సును ఇసుకలో ఉంచి 30 నిముషాలకు పైగా శ్వాసను దిగ్బంధం చేసుకుని వాయు స్తంభన యోగ విద్య ప్రదర్శన చేసిన యోగానంద భారతీస్వామిని పెద్దసంఖ్యలో భక్తులు, నగర ప్రజానీకం, ప్రముఖులు సందర్శించారు. ఈ సందర్భంగా యోగానంద భారతీస్వామి ప్రసంగిస్తూ శరీరంలో షట్ చక్రాలను నియంత్రించి సాధన చేయడం ద్వారా అనేక శక్తులు లభిస్తాయని మన మహర్షులు తెలియజేశారని, అపూర్వమైన ఈ వాయుస్తంభన విద్య ద్వారా భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నానని స్వామీజీ వివరించారు. అంతకుముందు రామనామక్షేత్రానికి విచ్చేసిన స్వామి యోగానంద భారతికి క్షేత్రపాలకవర్గ సభ్యులు ఎదురేగి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. వాయుస్తంభన విద్య ప్రదర్శించేముందు అరగంటకు పైగా స్వామీజీ మౌనధ్యానం చేసి ఇసుకలో తన శిరస్సును, శరీర సగభాగాన్ని కప్పుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles