Happy ending to telugu heroine anjali story

telugu cinema, anjali, seethamma vakitlo sirimalle chettu, venkatesh, anjali actress, hyderabad west zone dcp

happy ending to telugu heroine anjali story

సుఖాంతం

Posted: 04/13/2013 09:32 AM IST
Happy ending to telugu heroine anjali story

అంజలి కథకి శుభం కార్డు పడింది. 

తాను కేవలం విశ్రాంతికోసమే వెళ్ళానని, తాను ఇన్ని రోజులు ఎక్కడున్నది పోలీసులకు వివరించానని, తనకోసం ఆదుర్దా పడినవారికి, తనగురించి పట్టించుకున్న మీడియాకు కృతజ్ఞతలు తెల్పుకుంటున్నానంటూ తెలియజేసిన అంజలి ఎల్లుండి నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నానని కూడా చెప్పారు. 

వెస్ట్ జోన్ డిసిపి శ్రీధర్ బాబు ఎదురుగా హాజరై అంజలి ఆయనకు తన అజ్ఞాతం గురించిన వివరణనిచ్చారు.  ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అంజలి తను కేవలం రిలాక్స్ అవటం కోసమే ఎవరూ తనను డిస్టర్బ్ చెయ్యని చోట అజ్ఞాతంగా ఉండిపోయానని, తన బాధ్యత తనకు తెలుసు కాబట్టి తిరిగి షూటింగ్ కి వచ్చానని ఆమె తెలియజేసారు. 

అంజలి గురించి తెలుగువాళ్ళల్లో చాలా మంది ఆదుర్దా పడిన మాట వాస్తవమే.  ఇన్నాళ్ళకు పదహారణాల తెలుగు అమ్మాయి, అందం, నటన, హీరోయిన్ కి కావలసిన లక్షణాలన్నీ ఉన్న నటి తెలుగు సినిమాకి దొరికినట్టే దొరికి ఇలా అదృశ్యమైందేమిటా అని బాధపడినమాట నిజమే.  అంతేకాదు ప్రత్యూష విషయంలోనూ అలా జరిగిందే, ఏమిటి మన తెలుగు పరిశ్రమ చేసుకున్న పాపం అని వాపోయినవారూ ఉన్నారు.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వస్తూనే నూటికి నూరు మార్కులూ కొట్టేసిన హీరోయిన్ అంజలి ఆ సినిమాలో వెంకటేష్ సరసన నటించింది.

ఏమైతేనేం, చివరకు కథ సుఖాంతమైంది, మన అమ్మాయి మనకు దక్కింది అని సినిమా రంగంలోనివారు ఆనందపడ్డారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles