Dot asked not to coerce telephone companies

department of telephones, delhi high court, supreme court of india, bharati airtel, idea cellular, vodaphone, 3g service

dot asked not to coerce telephone companies

ఫోన్ కంపెనీలను కుళ్ళబొడవకండి

Posted: 04/12/2013 03:05 PM IST
Dot asked not to coerce telephone companies

ప్రైవేట్ ఫోన్ కంపెనీల మీద అనవసరంగా వత్తిడి పెంచవద్దని ముందు సుప్రీం కోర్టు ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఈ రోజు కేంద్రాన్ని వారించాయి.

ఒప్పందానికి లోబడి నడవకుండా వారికి కేటాయించని స్థలాల్లో కూడా ఇతర ఫోన్ కంపెనీలతో కలిసి 3జి సేవలను అందిస్తున్నారంటూ డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలిఫోన్స్ ఐడియా సెల్యూలార్, వోడాఫోన్ల మీద వరుసగా 300 కోట్ల రూపాయలు, 550 కోట్ల రూపాయల జుర్మానా విధించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఆ చర్యను నిరోధిస్తూ తీర్పునిచ్చింది. 

అంతకు ముందు సుప్రీం కోర్టు భారతి ఎయిర్ టెల్ విషయంలో కూడా వాళ్ళకి అనుమతి లేని ప్రాంతాల్లో 3జి సేవలనందించవద్దని అలా చేసినట్లయితే భారీ జుర్మానా ఉంటుందని ఇచ్చిన నోటీసు దృష్ట్యా ప్రైవేట్ ఫోన్ కంపెనీల మీద వత్తిడి కలిగించవద్దని ఆదేశించింది.  అయితే సుప్రీం కోర్టు భారతి ఎయిర్ టెల్ కి కూడా ఆ కంపెనీకి 3జి అనుమతి లేని ఏడు ప్రాంతాలలో కొత్తగా ఏ వినియోగదారునికీ 3జి సేవలనందించవద్దని ఆదేశాలిచ్చింది.  అదే పద్ధతిలో ఢిల్లీ హైకోర్టు కూడా వోడాఫోన్ ఐడియా లను కొత్త వినియోగదారులను 3జి సర్వీసులో చేర్చుకోవద్దని ఆదేశించింది. 

ప్రైవేటు ఫోన్ కంపెనీలు వాటికిచ్చిన 3జి అనుమతుల స్థానాలు కాకుండా మిగతా చోట్లలో వాళ్ళకి 3 జి సేవలను ఇతర ఫోన్ కంపెనీలతో ఒప్పందానికి వచ్చి అందించటం జరుగుతోంది.  దాన్ని తప్పుపట్టిన డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలిఫోన్స్ ఫోన్ కంపెనీలను హచ్చరించటమే కాకుండా భారీ జుర్మానాలను కూడా విధించిన నేపథ్యంలో ఆ కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి.

 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles