Indian tourisma going to get benefited

union tourism department, union minister, chiranjeevi, south asian countries, east asian countries

indian tourisma going to get benefited

పర్యాటక శాఖకు మంచిరోజులు

Posted: 04/09/2013 05:52 PM IST
Indian tourisma going to get benefited

భారత పర్యటనను అభివృద్ధి చెయ్యటం కోసం ప్రపంచం నలుమూలలనుంచి నిపుణులను పిలిపించి ప్రణాళికలను సిద్ధం చేస్తామంటూ కేంద్ర పర్యాటక శాఖామాత్యులు చిరంజీవి అన్నారు.  హైద్రాబాద్ లో ఏప్రిల్ 12 నుంచి 14 వరకు పర్యాటక శాఖ మనుగడకోసం సమావేశాలు జరుగనున్నాయి.  ఇరవై తూర్పు ఆసియా దేశాల నుంచి, తొమ్మిది దక్షిణ ఆసియా దేశాల నుంచి,  300 మంది పర్యాటక నిపుణులు సమావేశంలో పాల్గొంటారని చిరంజీవి తెలియజేసారు. 

ఈ పెద్ద ఈవెంట్ ని కేంద్ర పర్యాటక శాఖతో రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించబోతోంది.  ఇది 25 వ యునైటెడ్ నేషన్స్  వర్ల్ డ్ టూరిజం ఆర్గనైజేషన్ సమావేశమని, దీనిలో పాల్గనే నిపుణుల ద్వారా మనకి పర్యాటక శాఖను అభివృద్ధి పరచుకునేందుకు మార్గాలు సంపూర్ణస్థాయిలో గోచరిస్తాయని, దానితో సామాజిక ఆర్ధికాభివృద్ధి కలుగుతుందని, సమావేశం ఉద్దేశ్యం అదేనని చిరంజీవి అన్నారు. 

ఈ ఆర్థిక సంవత్సరంలో పర్యాటక శాఖాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 221 కోట్ల రూపాయలను కేటాయించిందని, దానితో సర్వతోముఖమైన అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలను నిర్వహించవచ్చని చిరంజీవి తెలియేజేసారు.  పర్యాటకాభివృద్ధికోసం ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న సత్ఫలితాలనిచ్చే మార్గాలను ఈ సమావేశంలో జరిగే చర్చల ద్వారా మనం తెలుసుకోవచ్చన్న చిరంజీవి, ఈ సమావేశం తర్వాత దేశంలో పర్యాటక శాఖ తప్పక పుంజుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తంచేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles