Aadhar to bear full date of birth now

aadhar card, unique identification, date of birth on aadhar, gas connection, bank account, mobile connection, passport

aadhar to bear full date of birth now

ఆధార్ మీద ఖర్చు 2000 కోట్ల పైచిలుకే

Posted: 04/09/2013 04:30 PM IST
Aadhar to bear full date of birth now

స హ చట్టం ఆధారంగా తెలిసిన వివరం- ఆధార్ యూనిక్ ఐడెంటిఫికేషన్ లో ఇంతవరకు 23 కోట్ల ఆధార కార్డ్ అప్లికేషన్ల మీద 2000 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది.  ఇంతవరకు 21 కోట్ల ఆధార్ నంబర్లను కేటాయించటం జరిగింది. 

అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆధార్ కార్డ్ లలో ఇంతవరకు పుట్టిన తేదీ మొత్తం కాకుండా కేవలం సంవత్సరం మాత్రమే ముద్రిస్తున్నారు.  అయితే వ్యక్తిగత గుర్తింపుకి ఆధార్ కార్డ్ ఒక్కటే చాలు అంటూ చెప్తున్న నేపథ్యంలో, మిగిలిన వ్యక్తిగత ఆధారాలను పక్కకు నెట్టేస్తున్న సందర్భంగా ఆధార్ కార్డ్ లో పుట్టిన తేదీ పూర్తిగా ఉండటం అవసరమన్న సంగతి గుర్తించిన అధికారులు ఇకనుంచి దాన్ని అమలుపరుస్తున్నారు.  బ్యాంక్ ఖాతాలు తెరవటానికి, మొబైల్ ఫోన్ కనెక్షన్లకీ ఇతర ప్రభత్వ ప్రైవేట్ సంస్థలలో పనులకు ఆధార్ కార్డ్ ఒక్కటే సరిపోయేటట్టుగా రూపొందించదలచుకున్నప్పుడు దానిలో పుట్టిన తేదీని పూర్తిగా ఇవ్వకపోతే పని జరగదని తెలుసుకున్న అధికారులు ఆ సవరణను చేస్తున్నారు.  నిజానికి ఆధార్ కోసం పెట్టుకున్న అర్జీలతో పాటు పుట్టిన తేదీ ఋజువులను అడుగుతున్నారు కానీ వాటిని పూర్తిగా కార్డ్ లో రాయటం లేదు. 

గ్యాస్ కనెక్షన్, బ్యాంక్ ఖాతాలు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెంస్, వోటర్ కార్డ్, మొబైల్ ఫోన్ కనెక్షన్లకు పుట్టిన తేదీ ఋజువులు తప్పనిసరి కాబట్టి, వాటికి ఆధార్ ని వాడాలంటే ఆధార్ లో పుట్టిన తేదీ పూర్తగా ఉండటం అవసరం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles