Thane building collapse toll at 30 over 50 injured

thane building collapse, building collapse, thane building collapse, national disaster response force, 30 dead in thane building collapse, under-construction illegal building collapsed, maharashtra, thane building collapsein maharashtra,

Thane building collapse toll at 30, over 50 injured

Thane-building.gif

Posted: 04/05/2013 12:10 PM IST
Thane building collapse toll at 30 over 50 injured

Thane building collapse toll at 30, over 50 injured

చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది.  ఏదైన ప్రమాదం జరిగిన తరువాత గానీ ..అధికారులకు నిద్రలేవరు.  ఏడంతస్తుల భవనం  ఒక్కసారిగా కుప్పకూలిపోయి.. భారీ ప్రాణ నష్టం జరిగిన  తరువాత అధికారులు ఆ భవంతికి గురించి ఆలోచిస్తారు.  మహారాష్ట్రలోని ధానేలోని షిల్ ధాయ్ గర్ లో  నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది.  ఈ ఘటనలో  అనేక మంది ప్రాణాలు కొల్పోయారు. అయితే అధికారుల లెక్కలు ప్రకారం ఇప్పటి వరకు  మ్రుతుల సంఖ్య 30 చేరిందని చెబుతున్నారు. 50 మందికి  పైగా  క్షతగాత్రులు  వివిధ ఆసుపత్రుల్లో  చికిత్స పొందుతున్నట్లు సమాచారం.  ఇప్పటికే  12 అగ్నిమాపక శకటాలు, 26 అంబులెన్సులతో ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపడుతున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ భవంతికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు చెప్పారు. పోలీసు అధికారి దిగంబర్ మాట్లాడుతూ.. 54 మంది ఈ ఘటనలో గాయపడ్డారని చెప్పారు. రెస్క్యూ టీం భవన శిథిలాల కింద ఉన్న వారి కోసం వెతుకుతోందని చెప్పారు. భవన నిర్మాణానికి స్థానిక అధికారులకు ఎలాంటి అనుమతులు లేవని చెప్పారు. మొదటి నాలుగు అంతస్తులలో ఇళ్లు, కార్యాలయాలు ఉన్నాయని చెప్పారు. నాలుగు అంతస్తుల్లో పలువురు ఉంటున్నారని, తదుపరు మూడు అంతస్తులు కూడా కూలే సమయానికి పూర్తయ్యాయని, మరో అంతస్తు కోసం కూలీలు పని చేస్తున్నారని చెబుతున్నారు.   అధికారులు మాత్రం చావుకబురు చల్లగా చెబుతున్నారు.  ఈ భవంతికి  ఎలాంటి అనుమతులు లేవని అంటున్నారు. అయితే మ్రుతుల సంఖ్య ఇంక పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles