ఆరోగ్యశ్రీ మీద మంత్రుల భేదాభిప్రాయం తెరమీదికి వచ్చింది.
ఆరోగ్యశ్రీ చెల్లింపుల మీద వృద్ధికి డిమాండ్ సమంజసమేనని ఆరోగ్యశాఖామాత్యులు డి.ఎల్ రవీంద్రారెడ్డి నిన్న ఖాజీపేటలో ప్రకటించారు. 30 శాతం కాకపోయినా ఎంతో కొంత పెంచుతామంటూ ప్రభుత్వం చర్చలకు దిగిరావాలి కదా అన్నారాయన. ఆరోగ్యశ్రీ చెల్లింపుల మీద 30 శాతం వృద్ధికి ప్రైవేటు హాస్పిటల్స్ కోరిన కోరిక ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో ఎపి స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్, ఏపి ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్లు, మే 3 నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయటానికి నిర్ణయించుకున్నాయి.
ఈ సందర్భంలో ఆయన 2008 లో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం చాలా గొప్పదని, మంచి ఉద్దేశ్యంతో ప్రారంభించబడిందని గుర్తుచేసుకున్నారు. అదే సందర్భంలో, వైద్య విద్య పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని, డబ్బులు పోసి వైద్య వృత్తిని అభ్యసించినవారు వ్యాపార దృష్టితోనే ఆ పెట్టుబడిని వసూలుచేసుకోవటానికి చూస్తారని అన్నారాయన.
ఆరోగ్యశ్రీ చెల్లింపుల విషయంలో వైద్య విద్య ఆరోగ్య శాఖామాత్యులైన కొండ్రు మురళి తీవ్ర స్థాయిలో స్పందించారు. అలాంటి బెదిరింపులకు ప్రభుత్వం తలవంచదని చెప్పారాయన. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ వలన విపరీతంగా సొమ్ములు చేసుకున్నాయని అభిప్రాయపడ్డారాయన. పోయిన సంవత్సరం 1400 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంలో ఖర్చు పెట్టి ఈ సంవత్సరం 1600 కోట్లను కేటాయించిందని ఆయన వెల్లడిచేసారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పదవీ విరమణ చేసి పెన్షన్ పొందుతున్నవారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఆరోగ్యశ్రీ వర్తించేట్టు చెయ్యటానికి సిద్ధపడటం వలన ఆ మొత్తం మరో 350 కోట్ల రూపాయలు పెరుగుతుంది. ఆరోగ్యశ్రీ చికిత్సల్లో కొన్నిట్లో ఎక్కువ, కొన్నిట్లో తక్కువ పడివుండవచ్చు కానీ, మొత్తం మీద ప్రైవేటు హాస్పిటల్స్ 1200 కోట్ల వరకు లాభాన్ని పొందివున్నాయని, అటువంటి నేపథ్యంలో వాళ్ళ డిమాండ్ సరికాదు కాబట్టి, వాళ్ళ ఒత్తిడులకు లొంగే ప్రసక్తే లేదంటూ కొండ్రు మురళి స్పష్టం చేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more