Bjp and left parties getting ready for bundh on 9th

bharatiya janata party, cpi, cpm, bundh on 9th april, electricity charges hike, chief minister, kiran kumar

bjp and left parties getting ready for bundh on 9th

bjp-left-parties.png

Posted: 04/04/2013 03:26 PM IST
Bjp and left parties getting ready for bundh on 9th

bjp-cpi

అమాంతం పెంచేసిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలకు ప్రభుత్వం తలవొగ్గే పరిస్థితి కనిపించుతుండటంతో పార్టీలు ఈ సమయంలో వెనక్కి తగ్గకుండా ఉంటేనే తాము ఈ పని చేయించినట్లవుతుంది, ఫలితం తమ ఖాతాలో పడుతుంది కాబట్టి పట్టు వదలకూడదనుకుంటున్నారు. అదే సందర్భంలో మా అంతట మేమే ఛార్జీలను తగ్గించాం కానీ ప్రతిపక్షాలు చెప్పబట్టి కాదని అనటం కోసం అధికారపక్షం నిర్ణయం తీసుకోవటానికి సరైన సమయంకోసం చూస్తున్నాయి.

ప్రజల నిరసనలకు ఒక మెట్టు దిగినట్టుగా ప్రభుత్వం నటిస్తున్నదే కానీ నిజం కాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించటానికి పరిశీలిస్తానని అనటం ముఖ్యమంత్రి బాధ్యతా రాహిత్యమని ఆయన ఆరోపించారు. పెంచిన ఛార్జీలు తగ్గించమని డిమాండ్ చేస్తున్నాం, తగ్గించాలి కానీ, పరిశీలించటమేమిటంటారాయన. అందువలన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల 9 న రాష్ట్రవ్యాప్తంగా బంద్ కి పిలుపునిచ్చారు.

సుందరయ్య విఙానకేంద్రంలో సమావేశమైన వామపక్షనేతలు రాష్ట్ర బంద్ విషయంలో చర్చిస్తున్నారు. ఈ నెల పిలుపునిస్తున్న బంద్ తో ప్రభుత్వం కళ్ళు తెరుచుకుంటాయని, బొగ్గు మాఫియా వలనే విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని, ఈ నిరసనల వలన ప్రభుత్వం దిగిరాక తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.

తెలంగాణా సమస్య ముదిరిపాకాన పడటానికి ఉన్న కారణాల్లో ఒకటి ఇలాంటి సమస్యే. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం వైపు మొగ్గు చూపిస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లా లేకపోతే తెరాస, ఇతర తెలంగాణా ఉద్యమకారుల పట్టుదల గెలిచినట్లా. ఓటర్ల దృష్టిలో అది ఎవరి ఖాతాలోకి వెళ్తుందన్నది ఒక కొరుకుడుపడని సమస్యగా మారింది. ప్రజా సమస్యలను పరిష్కరించాలి నిజమే కానీ ఆ పని ఎవరు చేసినట్లుగా ప్రజల గుర్తింపు వస్తుంది, రాజకీయ లబ్ధి ఏవిధంగా పొందుతాం అన్నవి పార్టీల్లో చర్చనీయాంశమౌతోంది. 2014 ఎన్నికలనే పెద్ద పరీక్షలు నెత్తిమీదకు వస్తుండటంతో రాజకీయ పార్టీలకు అవి తప్ప మరి దేనిమీదకూ ఆలోచనలు పోవటం లేదు, మరిదేనిమీదా ఆసక్తి కలగటం లేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Renuka chowdhery house surrounded by trs women wing
President cleared all pending mercy petitions from 1981 till date  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles