Renuka chowdhery house surrounded by trs women wing

renuka chowdhery, congress party, telangana rashtra samiti, suicides for telangana, renuka chowdhery comments on suicides

renuka chowdhery house surrounded by trs women wing

renuka-chowdary-attack.png

Posted: 04/04/2013 05:19 PM IST
Renuka chowdhery house surrounded by trs women wing

renuka-chowdary

హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఇంటిమీద తెలంగాణా రాష్ట్ర సమితి మహిళా విభాగం సభ్యులు దాడిచేసారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమె ఇంటి మీదకు కోడిగుడ్లు, రాళ్ళు, చెప్పులు, చీపురు కట్టలను విసిరారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

మొన్న ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన రేణుకా చౌదరి తెలంగాణా నేతల గురించి హేళనగా మాట్లాడటమే కాకుండా, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకోసం ఆత్మహత్యలు చేసుకున్నవన్నీ నిజమైన ఆత్మహత్యలు కావని, వాళ్ళంతా టి.బి., పోలియో, క్యాన్సర్, గుండె జబ్బుల్లాంటి వ్యాధుల వలన మరణించారని, దాన్ని తెరాసా ఆత్మహత్యలుగా చెప్తోందని అన్నారు. దానికి ముందు ఆత్మహత్యల పాపం కెసిఆర్ దేనని, ఉద్యమమేమో కానీ వసూళ్ళ దుకాణాలు పెట్టారంటూ కెసిఆర్ ని విమర్శించారు.

ఈ వ్యాఖ్యలతో రగిలిపోయిన తెరాస కార్యకర్తలు రేణుకా చౌదరి తనన్న మాటలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆమె ఇంటి ముందు నినాదాలు చేస్తూ ఆందోళన చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Complaint against mahesh babu in shrc
Bjp and left parties getting ready for bundh on 9th  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles