New medicine approved by fda for diabetes type 2 patiesnts

diabetes type 2, johnson and johnson, invokana medicine, fda usa

new medicine approved by fda for diabetes type 2 patiesnts

diabetes-type-2.png

Posted: 03/31/2013 11:16 AM IST
New medicine approved by fda for diabetes type 2 patiesnts

fda-approved-drug

టైప్ 2 సుగర్ పీడితులకు జాన్సన్ అండ్ జాన్సన్ కనుగొన్న కొత్త ఔషధానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదముద్ర వేసింది. కొత్తగా వచ్చిన ఔషధాలలో మున్ముందుగా ఎఫ్ డి ఏ ఆమోదించిన ఈ మందు వలన రక్తంలోని చక్కెర మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఔషధాన్ని 10 వేల మంది మీద ప్రయోగం చేసి చూసినతర్వాత ఎఫ్ డి ఏ దీనికి ఆమోదాన్ని తెలిపింది.

సాధారణంగా చక్కెర వ్యాధికి తీసుకునే మందులు శరీరంలోని ఇన్సులిన్ లోపాన్ని పూరించటానికి బయటినుంచి సరఫరా చేసేవే ఉంటాయి. కానీ ఈ కొత్త మందు ఇన్సులిన్ ని శరీరంలోకి జొప్పించటం కాకుండా, రక్తంలో ఉన్న చక్కెరను విడదీసి శరీరం మూత్రం ద్వారా విసర్జించేందుకు పనిచేస్తుంది. ఈ మందుకి ఇన్వోకేనా అని పేరు పెట్టారు. దీన్ని రోజుకి ఒకసారి తీసుకుంటే చాలని చెప్తున్నారు.

అయితే దీనికి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉందట. 30 రోజులు క్రమం తప్పకుండా ఈ ఔషధాన్ని సేవించినవారి గుండె మీద కాస్తంత ప్రభావం చూపించటం కూడా పరిశీలనలో తెలిసింది. దానికి కారణం ఈ ఔషధం కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. అందులో శరీరానికి ఉపయోగపడే హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ తో పాటు హానిచేసే ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ కూడా ఉంటాయి.

ప్రస్తుతం టైప్ 2 సుగర్ వ్యాధికున్న మందులలో ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్ ఇచ్చేవే ఉన్నాయి. ఊబకాయం రావటమో లేకపోతే ఉన్నట్టుండి సుగర్ లెవెల్ పడిపోవటం లాంటి లక్షణాలు కలుగజేసే మందులున్నాయి. ఈ కొత్త మందు పనిచేసే విధానం మంచిదైనా, దీని సేవనం వలన గుండెకు కానీ కాలేయం, పాంక్రియాస్ లకు ఎటువంటి హాని జరగదని నిర్ధారించటానికి ఇంకా ప్రయోగాల ద్వారా పరిశీలన జరుగుతోంది.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Train fares costlier from today
Sekhar kammula i care i react organisation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles