Crowded pointspng

crowded-points.png

Posted: 03/30/2013 04:43 PM IST
Crowded pointspng

రాష్ట్రంలో రెండు చోట్ల మనుషుల రద్దీ కనిపిస్తోంది. ఒకటి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో, రెండు తిరుమలలో.

ఏప్రిల్ 1 నుంచి పెరుగుతున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలతో ఇళ్ళు, స్థలాల రిజిస్ట్రేషన్ ఖర్చు భారీ అవుతుండటంతో ఈ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ కిటకిటలాడుతున్నాయి. భూముల విలువలను సవరించటంతో వాటిమీద రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరిగిపోతున్నాయి. దాన్నుంచి తప్పించుకోవటానికి ఎప్పుడో చెయ్యాల్సిన రిజిస్ట్రేషన్లను ఇప్పుడే చేయించుకుంటే పోలే అనుకుంటూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను రద్దీగా చేసారు.

వరసగా మూడు రోజులు శలవులు రావటంతో తిరుమల వేంకటేశ్వరుని దర్శనార్ధం వెళ్ళేవాళ్ళ సంఖ్య అమితంగా పెరిగిపోయింది. 300 రూపాయల టికెట్ కొన్నవారు 5 కిలోమీటర్లు బార్లు తీరివున్నారు. వారికి దర్శనభాగ్యం కలగటానికి 12 గంటలు పట్టవచ్చని అంచనా. ఇక సర్వదర్శనం క్యూలో ఉన్నవాళ్ళకి 20 గంటలు పట్టవచ్చు.

శ్రమ పడకుండా ప్రయోజనం ఎలా కలుగుతుంది. అందువలన ముందు చూపుతో కొందరు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను సందర్శిస్తుంటే, అదే ముందు చూపుతో పుణ్యం సంపాదించుకుందామనే ఉద్దేశ్యంతో దేవాలయ సందర్శనం చేసుకుంటూ శలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు మరికొందరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Possiblie criminal activity acertainable
China made stbs throng hyderabad markets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles