China made stbs throng hyderabad markets

stb, set top box, china made stb, mandatory cable digitisation, ministry of information and boadcasting

china made stbs throng hyderabad markets

china-stbs.png

Posted: 03/30/2013 03:52 PM IST
China made stbs throng hyderabad markets

set-top-box

ఏప్రిల్ 1 నుంచి సెట్ టాప్ బాక్స్ (ఎస్ టి బి) పెట్టుకోకపోతే టివి చూడలేరు. ఎందుకంటే టివి కేబుళ్ళను డిజిటలైజ్ చెయ్యాలని ప్రభుత్వం ఆదేశాన్ని సమాచార శాఖ ప్రకటించింది. ఎస్ టి బి లేకుండా టివి లో బొమ్మ కనపడదు. మరింకేం, కేబుల్ ఆపరేటర్లు చేతివాటం చూపించటానికి సరైన సమయం. సెట్ టాప్ బాక్స్ గురించి అందరికీ అవగాహన ఉండదు కాబట్టి పేరు, ఊరు లేని ఎటువంటి హామీలు ధరలు ప్రకటించని చైనా ఉత్పత్తులు హైద్రాబాద్ నగరంలో రాజ్యం చేస్తున్నాయి. 1200 నుంచి 1800 వరకు ఇష్టానుసారం ఛార్జ్ చేస్తున్నారు.

ఇంతకు ముందు చైనా ఫోన్లు అలాగే ఎలక్ట్రనిక్ మార్కెట్ మీద దాడి చేసాయి. చౌకగా లభించటం, రంగురంగులతో ఆకట్టుకోవటం మాత్రమే చూసారు కానీ, నాణ్యత లోపాన్ని చూడలేదు. ముఖ్యంగా వినియోగదారులను రేడియేషన్ ని కాపాడే చర్యలేమీ తీసుకోరు. శబ్ద కాలుష్యం కూడా ఎక్కువే ఉంటుంది. కాకపోతే రకరకాల లైట్లు వెలిగి మలిగి మొదట్లో వినియోగదారులను బాగా ఆకట్టుకున్నాయి. గ్యారెంటీ ఏమీ లేదని చెప్పినా వాటి అమ్మకాలు బాగా ఊపందుకున్నాయి. దానిలోంచి తేరుకున్నారనుకుంటే ఇప్పుడు ఎస్ టి బి లు దాడికి దిగాయి.

ఎస్ టి బి వలన ఉపయోగాలున్నాయి. పిక్చర్ స్పష్టంగా ఉంటుంది, శబ్దం స్పష్టంగా ఉంటుంది. 500 ఛానెల్స్ ని చూడవచ్చు. అదే ఇప్పుడున్న కేబుల్ ద్వారా డైరెక్ట్ గా వచ్చే ప్రసారాలలో మొదట్ల కొన్ని ఛానెల్స్ చివర్లో కొన్ని ఛానెల్స్ లో స్పష్టత ఉండదు. అయితే నాణ్యత లేని ఎస్ టి బిలు బిగించినా అలాగే తయారవుతుంది. అందులో ఉన్న లాభశాతం, వినియోగదారుల మీద ఎస్ టి బి పెట్టుకోవాలనే ఒత్తిడి ని ఆసరాగా తీసుకుని కేబుల్ ఆపరేటర్లు చైనా నుంచి టోకున నాణ్యత లేని ఎస్ టి బి లు తెప్పించి వినియోగదారులకు అంటగడుతున్నారు.

ఎస్ టి బి ఉత్పత్తులలో పాటించవలసిన నియమాలను పాటించకుండా తయారు చేసారని కనిపెట్టి నగరంలోని లీగల్ మెట్రోలజీ డిపార్ట్ మెంట్ అధికారులు 1500 చైనా ఎస్ టి బి లను ఆధీనంలోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Crowded pointspng
83 dead in landslide in tibet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles