25 years old human skeletal remnants in srilanka

srilanka, marxist party, human skeletal remnants, srilanka mass burying, 25 years old human remnants

25 years old human skeletal remnants in srilanka

human-remnants.png

Posted: 03/28/2013 12:37 PM IST
25 years old human skeletal remnants in srilanka

 human-bodies

శ్రీలంక తవ్వకాల్లో కంకాళాలు బయటపడ్డాయి. అవి కూడా ఒకేసారి కలిసికట్టుగా పూడ్చిపెట్టినట్టుగా.

ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో భవన నిర్మాణాలు చేపట్టగా అక్కడ పనిచేస్తున్న పనివారికి కొన్ని మానవ అవశేషాలు కనిపించాయి. ఐదారు శవాలను ఒకదాని మీద మరొకటిగా పేర్చి, అలా పేర్చినవాటిని పక్క పక్కన పెట్టి మొత్తం 157 శవాలను అక్కడ ఒకే చోట పూడ్చిపెట్టినట్టుగా అస్తపంజరాలుగా మిగిలిన ఆ అవశేషాలు 1987, 1990 మధ్యలో పూడ్చినట్టుగా ఆర్కియోలజీ శాఖ, న్యాయశాఖలోని వైద్యబృందం కలిసి నిర్ణయించినట్టుగా మాటెలె కోర్టు లో మేజిస్ట్రేట్ చతురికా డెసిల్వా చెప్పారు. మరణానికి కారణం ఏమిటో ప్రకటించలేదు కానీ అవన్నీ సామూహికంగా పూడ్చబడినట్టుగా కనిపిస్తున్నాయన్నారాయన.

1940 ప్రాంతంలో చెలరేగిన ప్రాణాంతక అంటు వ్యాధి వలన మృతిచెందినవారి అవశేషాలంటూ ముందు ఒక ప్రకటన జరిగింది.   కానీ ఆ సమయంలో హాస్పిటల్ ఆవరణలో శవాలను పూడ్చిపెట్టినట్టుగా హాస్పిటల్ రికార్డ్ లలో లేదు. 1971లోనూ, మరోసారి 1987-89 మధ్య కాలంలో చురుగ్గా పనిచేసిన మార్క్సిస్ట్ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ మాత్రం, సెక్యూరిటీ ఫోర్స్ చంపిన కామ్రేడ్ శవాలైయ్యుండొచ్చంటున్నారు. అప్పట్లో మార్క్సిస్ట్ పార్టీలో పనిచేసినవారంతా గ్రామీణ సింహళీయులే. వారు ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి ఉన్నవారే.

ఆ విప్లవకారులతో సంబంధమున్న రాజకీయ పార్టీకి చెందిన అనురా డిస్సనాయకే చెప్పినదాని ప్రకారం, ఆ సమయంలో దేశ సైన్యం, పారా మిలిటరీ వర్గాలు సామూహిక హత్యలు చేసారని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  All party meet on babli issue is over
Attacked new zealand cricketer jesse ryder in coma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles