Attacked new zealand cricketer jesse ryder in coma

jesse ryder, new zealand cricketer, cricket match, jesse ryder attacked, jesse ryder condition critical

attacked new zealand cricketer jesse ryder in coma

jesse-ryder-in-coma.png

Posted: 03/28/2013 09:23 AM IST
Attacked new zealand cricketer jesse ryder in coma

jesse-ryder-photo

నిన్న అర్ధరాత్రి న్యూజిల్యాండ్ క్రికెట్ ఆటగాడు జెస్సీ రైడర్ మీద జరిగిన దాడిలో గాయపడి క్రిస్ట్ చర్చ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు.

జెస్సీ రైడర్ కోమాలో ఉన్నారని ఆయన్ని ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి వైద్యపరిశీలనలు చేస్తున్నారని న్యూజిల్యాండ్ రేడియోలో వార్తల్లో చెప్పారు. జెస్సీ రైడర్ గాయాల పరిస్ధితి మీద హాస్పిటల్ అధికారులు ఏమీ చెప్పటం లేదు కానీ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మాత్రం అంటున్నారు. తల పగిలటం వలన ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతోందని అది ప్రమాదకరమైన పరిస్థితని వార్తలు వస్తున్నాయి.

ప్రత్యక్ష సాక్షులు చెప్పినదాని ప్రకారం, మెరివాల్ శివార్లలో ఉన్న బార్ బయట నలుగురు మనుషలు జెస్సీ రైడర్ మీద దాడి జరిపారు. కింద పడిన తర్వాత కూడా అతని మీద ముష్టి ఘాతాలతో గాయపరచారు. కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఈ రోజు దాని మీద వివరణలను ప్రకటిస్తామంటున్నారు.

బుధవారం నాడు న్యూజిల్యాండ్ లో క్రిస్ట్ చర్చ్ లో స్థానిక ఒకరోజు క్రికెట్ పోటీలో సెమీ ఫైనల్స్ లో ఆడిన జెస్సీ రైడర్ తన జట్టులో ఆడిన ఆటగాళ్ళతో కలిసి ఆ బార్ కి వచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  25 years old human skeletal remnants in srilanka
Ram charan tej birthday celebrated in his absence  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles