Bsp leader deepak bhardwaj murdered in delhi

bsp party, bsp candidate deepak bhardwaj, deepak bhardwaj murder, deepak bhardwaj farm house

bsp leader deepak bhardwaj murdered in delhi

bsp-leader.png

Posted: 03/26/2013 02:42 PM IST
Bsp leader deepak bhardwaj murdered in delhi

deepak-bhardwaj-photo

ఢిల్లీ బహుజన సమాజవాది పార్టీ నాయకుడు దీపక్ భరద్వాజ్ ఈ రోజు ఉదయం 9.15 కి హత్యగావించబడ్డారు.  62 సంవత్సరాల భరద్వాజ్ 2009 ఎన్నికల సమయంలో ఆయన ప్రకటించిన ఆస్తుల వివరాల ప్రకారం 600 కోట్ల రూపాయల ఆస్తులు గల అత్యంత సంపన్న అభ్యర్థి.  ఆయన్ని దర్శించటానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయన్ని తుపాకీతో కాల్చి చంపారు.  2009 లో ఎన్నికలలో పోటీ చేసిన భరద్వాజ్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి మహాబల్ మిశ్రా చేతిలో ఓడిపోయారు.  భరద్వాజ్ కి విద్యాలయాలు, హోటళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయి.  

బులెట్ దెబ్బ తిన్న భరద్వాజ్ ని ధౌలాకుఁవా లోని ఆర్మీ రిసెర్చ్ రిఫరల్ హాస్పిటల్ కి తీసుకెళ్ళగా ఆయన హాస్పిటల్ లో మరణించారు.  ఘర్షణలో మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయని తెలిసింది.  

ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్నామని, భరద్వాజ్ ఉదయమే తన స్కోడా కారులో ఫామ్ హౌస్ కి వెళ్ళారని, అక్కడ ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతుండగా మధ్యలో వాళ్ళు తుపాకులు బయటకు తీసి కాల్చి పారిపోయారని, అందుకు కారణమేమిటన్నది ఇంకా తేలలేదని ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలియజేసారు.  నిందితులిద్దరూ భరద్వాజ్ కి తెలిసినవాళ్ళే అయ్యుండాలని లేకపోతే సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళని లోపలికి అనుమతించి ఉండేవాళ్ళు కాదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jaya lalita warns upa govt
Cag report on state budget submitted to assembly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles