Ap assembly continues same noisy scenes

ap assembly, ap home minister, sabita indra reddy, harish rao, trs, telangana issue, leaders arrest in sadak bundh

ap assembly continues same noisy scenes

home-minister-explains.png

Posted: 03/23/2013 03:15 PM IST
Ap assembly continues same noisy scenes

sabita-indrareddy-photo

రోజూ లాగానే ఈ రోజు కూడా శాసన సభ ప్రతిపాల ఆందోళనతోనే ప్రారంభమైంది.  సభాపతి వాయిదా తీర్మానలను అంగీకరించకపోవటం కూడా జరిగింది.  రెండు సార్లు సభను వాయిదా వేసిన తర్వాత, మరోసారి అవిశ్వాస తీర్మానం సన్నివేశాన్ని గుర్తు చేస్తూ తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుడు హరీష్ రావు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.  సడక్ బంద్ లో నాయకులను ఎందుకు అరెస్ట్ చేసారో చెప్పమని, ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కుందని తెలంగాణా నాయకులు సభలో ప్రభుత్వాన్ని నిలదీసారు.  

విద్యుత్ సమస్య మీద చర్చలనెందుకు అంగీకరించరంటూ తెలుగుదేశం పార్టీ ఆందోళన చేసింది.  నిన్న కూడా ఇదే అంశం మీద ఆందోళన చేసిన తెదేపా సభ్యులు సభ అయిపోయిన తర్వాత కూడా రాత్రి పదకొండు గంటల వరకూ ఆందోళన సాగిస్తూనేవున్నారు.  ఆ తర్వాత కూడా పోలీసులు వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి ఎన్ టి ఆర్ భవన్ దగ్గర వదిలిపెట్టారు కాబట్టి అంతటితో అక్కడితో ఆగిపోయింది.  

ఈరోజు మళ్లీ తెలుగు దేశం పార్టీ సభ్యులు నిన్నటి లాగానే ముఖ్యమంత్రి ఛేంబర్ ఎదురుగా ధర్నా చెయ్యటం మొదలుపెట్టారు.  

శాసన సభలో హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలంగాణా నాయకుల అరెస్ట్ గురించి వివరణనిచ్చారు.  హైవే లలో ఇటువంటి కార్యక్రమాలకు సుప్రీం కోర్టు ఆంక్షలు విధించిందని, అనుమతి లేకుండా ఆందోళన చేసారని, అన్న రోజు కాకుండా మరో రోజున సడక్ బంద్ నిర్వహించారని, హైవేల మీద వాహనాలను ఆపి నప్పుడే నాయకులను అరెస్ట్ చెయ్యటం జరిగిందని ఆమె చెప్పారు.  

హోం మంత్రి ప్రకటనలను తెలంగాణా నాయకులు విమర్శిస్తూ ఆందోళన సాగించటంతో సభను సాగనివ్వటం కష్టమని తలచిన సభాపతి సోమవారానికి వాయిదా వేసారు.

  విద్యుత్ ఛార్జీల పెంపు మీద వామపక్షాలు నిరాహార దీక్షలు ప్రారంభించాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs leaders bail granted alampur court
Arvind kejriwal on fast from today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles