No consensus on srilankan tamils problem

srilanka tamils issue, all party meeting, dmk party, aidmk party, upa govt, congress party, chidambaram, meera kumar

no consensus on srilankan tamils problem

srilanka-tamil-issue.png

Posted: 03/21/2013 09:53 AM IST
No consensus on srilankan tamils problem

శ్రీలంక తమిళుల సమస్య మీద నిన్న సాయంత్రం పార్లమెంట్ సభాపతి మీరా కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు.  అమెరికా మానవ హక్కుల సమితి లో ప్రతిపాదించదలచుకున్న సవరణలలోని పదజాలాన్ని అవి తీవ్రంగా ఖండించలేదంటూ డిఎమ్ కె, అన్నా డిఎమ్ కే పార్టీలు తప్పుపడుతూ వస్తుంటే, అసలు మరో దేశంలోని కార్యకలాపాల మీద మనం ఒక ప్రత్యేక రిజొల్యూషన్ ని పాస్ చెయ్యటం సరికాదంటూ భారతీయ జనతా పార్టీ, సమాజ్ వాది పార్టీ, జనతాదళ్ యునైటెడ్ పార్టీలు అభ్యంతరం తెలిపాయి.  అఫ్జల్ గురు విషయంలో పాకిస్తాన్ రిజొల్యూషన్ ని పాస్ చెయ్యటం మనకి నచ్చనప్పుడు, శ్రీలంక అంతర్గంత వ్యవహారాల మీద మనం కూడా రిజొల్యూషన్ ని పాస్ చెయ్యటం సరికాదు అన్నారు భాజపా నాయకులు.

డిఎమ్కే వత్తిడికి తలవొగ్గినట్టు కాకుండా యుపిఏ తనంతట తానే ఈ సమస్యను పరిష్కరించబూనుకున్నట్లుగా చూపిద్దామన్న ఉద్దేశ్యంతో డిఎమ్ కే మద్దతుని ఉపసంహరించుకుని యుపిఏ నుంచి వైదొలగినా, అమెరికా మానవ హక్కుల సమితిలో శ్రీలంక సమస్య మీద చేస్తున్న ప్రతిపాదనలో సవరణలు చెయ్యటం కోసం అఖిల పక్ష సమావేశాన్ని పిలిచింది.

డిఎమ్ కే కోసమమని కాదు.  తమిళులు కేవలం తమిళనాడులోనే లేరు.  మరో పొరుగు దేశంలో కూడా ఉన్నారు, అక్కడ వేదనలను అనుభవిస్తున్నారు.  తమిళుల మనోభావాలకు స్వాంతన పలికే విధంగా పార్లమెంటులో ఒక రిజొల్యూషన్ పాస్ చెయ్యటమనేది ప్రభుత్వ ధర్మం అంటూ నిన్న చిదంబరం అన్నారు.  ఒక రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించటం తమ ధర్మమంటూ కేంద్ర సమాచార శాఖా మంత్రి మనీష్ తివారీ కూడా అన్నారు.

 కానీ యుపిఏ ప్రయత్నానికి అఖిలపక్ష మద్దతు లభించలేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Arrests of leaders in sadak bundh
Every one prepared for sadak bundh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles