Dmk withdraws ties with upa

upa, dmk party, sonia gandhi, mamnohan singh, karunanidhi, indira gandhi, srilanka issue

dmk withdraws ties with upa

upa-dmk.png

Posted: 03/20/2013 09:05 AM IST
Dmk withdraws ties with upa

karunanidhi

ఇంకా సంప్రదింపులు జరుగుతుండగానే, పార్లమెంటు లో ప్రవేశపెట్టదలచుకున్న రిజొల్యూషన్ నమూనా తయారవుతుండగానే ఉన్నట్టుండి అనూహ్యంగా నిన్న రాత్రి డిఎమ్ కె నాయకులు తమ మద్దతుని ఉపసంహరించుకుంటున్నామని తెలియజేస్తూ లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేసారు.  ఈ విషయాన్ని ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రికి తెలియజేస్తామని కూడా మద్దతును ఉపసంహరించుకోవటానికి వెళ్ళిన డిఎమ్కే పార్లమెంటరీ పార్టీ నాయకుడు టి.ఆర్ బాలు ఇతర పార్లమెంటు సభ్యులు తెలియజేసారు.  

ఈ ఘటన జరగగానే పరిస్థితిని సమీకరించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, యుపిఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, పార్లమెంటరీ మంత్రి కమలనాథ్, విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ లు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో సమావేశమయ్యారు.

కాంగ్రెస్ తయారు చేస్తున్న రిజొల్యూషన్ నమూనాలో శ్రీలంకలో జరిగిన మారణ హోమం గురించి డిఎమ్ కే ఆశించిన స్థాయిలో ప్రస్తావించటం జరగలేదని వారు భావిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం.  అందులోని పదాలు నిన్న ఉదయం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో సోనియా గాంధీ వాడినట్టుగానే ఉన్నాయి కానీ, ఐరాస మానవహక్కుల సంఘానికి శ్రీలంకలోని ఘోరమైన మారణకాండ గురించి తీవ్ర పదజాలంతో ప్రస్తావించలేదని డిఎమ్ కే భావించబట్టే యుపిఏ నుంచి మద్దతును ఉపసంహరించుకున్నట్టుగా తెలుస్తోంది.  కేవలం తమిళులకు సమానమైన హక్కులుండాలని చెప్తూ, ఈ విషయాన్ని అనాది నుంచీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు కూడా ఆశించినట్టుగా ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు కానీ తీవ్ర స్థాయిలో ఖండించకపోవటం డిఎమ్ కే కి మింగుడు పడలేదు.  అయితే ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలేమీ చెయ్యమని, ప్రతిపక్షంలో కూర్చుంటామని వారు అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Assembly working only half dasy
Three attackers on buddhist monk held by railway police  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles