Kavita daughter claims forced marriage

telugu actress kavita, kavita daughter marriage, love marriage turned forced marriage

kavita daughter claims forced marriage

marriage-by-force.png

Posted: 03/16/2013 01:37 PM IST
Kavita daughter claims forced marriage

kavita-daughter-marriage

సినీ నటి కవిత కూతురు మాధురి, తనను బలవంతంగా తీసుకెళ్ళి పెళ్ళి చేసుకున్నాడని పెళ్ళి చేసుకున్న రాజు మీద ఫిర్యాదు చేసింది.  దానితో ఇప్పటి దాకా ప్రేమ వివాహమనుకుంటున్న కథ మలుపు తిరిగింది.  

కవిత ఉంటున్న అపార్ట్ మెంట్ లో డ్రైవర్ గా పని చేస్తున్న రాజు 15 లక్షల రూపాయలను తీసుకుని రమ్మని, అలా చెయ్యకపోతే కుటుంబ సభ్యలకు హాని తలపెడతానంటూ బెదిరించాడని మాధురి ఆరోపించింది.  కూల్ డ్రింక్ తాగించాడని, అది తాగిన తర్వాత తనను ఎక్కడికి తీసుకునిపోతున్నదీ తెలియలేదని, పెద్దపల్లి తీసుకెళ్ళి అక్కడ బలవంతంగా పెళ్ళి చేసుకున్నాడని మాధురి చెప్తోంది.  

ఇదంతా బయటపడకముందు కూతురు కనిపించటం లేదని కవిత ఇచ్చిన ఫిర్యాదు మీద స్పందించిన పోలీసులు 24 గంటల్లోనే ఆమెను క్షేమంగా తీసుకుని వచ్చి అప్పగించినందుకు కవిత పోలీసులకు కృతఙతలు తెలియజేసింది.  ఇంటికి వచ్చిన మాధురి జరిగిన విషయాన్ని వివరిస్తూ తన ఇష్టపూర్వకంగా జరిగిన పెళ్ళి కాదని, రాజు తనను బలవంతంగా తీసుకెళ్ళి బెదిరించి పెళ్ళి చేసుకున్నాడని ఆమె స్టేట్ మెంట్ ఇచ్చింది.  

కవిత అంతకు ముందు సినిమాల్లో నటించిన తార మాత్రమే కాకుండా తెలుగు దేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న సభ్యురాలు కూడా.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Swiss national gang raped in mp
Delhi rapistspng  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles